16వ రోజు `మేమంతా సిద్ధం` బ‌స్సు యాత్ర ప్రారంభం

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి చేప‌ట్టిన `మేమంతా సిద్ధం` బ‌స్సు యాత్ర 16వ రోజు నారాయణపురం రాత్రి బస ప్రాంతం నుంచి ప్రారంభ‌మైంది. నారాయ‌ణ‌పురంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. జ‌న‌నేత‌కు గ‌జ‌మాల‌తో ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. 16వ రోజు మేమంతా సిద్ధం బ‌స్సు యాత్ర‌ నిడమర్రు, గణపవరం మీదుగా ఉండి చేరుకొని ఉండి శివారు చేరుకుంటుంది. ఉండి శివారులో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ భోజన విరామం తీసుకుంటారు. భోజ‌నం అనంతరం బయలుదేరి  భీమవరం బైపాస్ రోడ్ గ్రంధి వెంకటేశ్వర రావు జూనియర్ కాలేజ్ వద్ద సాయంత్రం 3.30 గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం పిప్పర, పెరవలి, సిద్ధాంతం క్రాస్ మీదుగా ఈతకోట శివారులో రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.

Back to Top