మానవత్వం చూపిన ముఖ్యమంత్రి

రోడ్డు ప్రమాద బాధితునికి సత్వర వైద్యం అందించాలని ఆదేశం

ఘటనా స్థలం వద్ద ఆగిన ముఖ్యమంత్రి

ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, ఏలూరు ఎంపీ అభ్యర్థి సునీల్ కుమార్ యాదవ్ కు వైద్యం కోసం తరలించే బాధ్యతలు అప్పగింత

కైకరం:  బస్సుయాత్రలో భాగంగా పశ్చిమగోదారి జిల్లా కైకరం వద్ద రోడ్డు ప్రమాద ఘటనలో గాయపడ్డ వారిపట్ల సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ తక్షణమే స్పందించి మానవత్వం చూపారు. సీఎం కాన్వాయ్ మరో పావుగంటలో వెళ్లబోతుందనగా ఒక పోలీస్ వాహనాన్ని ( కాన్వాయ్ వాహనం కాదు) బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు వెనకనుంచి ఢీకొట్టారు. కాన్వాయ్ ప్రయాణిస్తున్నప్పుడు రోడ్డు ప్రమాదం జరిగిన విషయాన్ని పోలీసు సిబ్బంది బస్సులో సీఎం పక్కనే ఉన్న భద్రతా సిబ్బందికి తెలియజేశారు. పూళ్ల నుంచి కాన్వాయ్ బయల్దేరి ఘటనా స్థలానికి చేరుకోగానే సీఎం బస్సును ఆపాల్సిందిగా ఆదేశించారు. ప్రమాదాన్ని చూసిన తర్వాత బాధితులకు వెంటనే వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. తనతోపాటు బస్సులో ప్రయాణిస్తున్న దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, ఏలూరు లోక్సభ అభ్యర్థి కారుమూరు సునీల్ కుమార్ యాదవ్ కు అక్కడే దించి వైద్యానికి తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భద్రతా నియమాలను ఉల్లంఘించి, సీఎం కాన్వాయ్ లో  ఉంచిన అంబులెన్స్ ద్వారా ఏలూరు ఆశ్రం ఆస్పత్రికి తరలించారు. సత్వర వైద్య సేవలు అందించడానికి వీలుగా ఆస్పత్రిలోని వైద్యలను, సిబ్బందిని అప్రమత్తంచేశారు.

Back to Top