అన్న రావడమే మాకు పెద్ద పండుగ

 

జననేతకు ఘన స్వాగతం పలుకుతున్న చిత్తూరు వాసులు

అన్న అధికారంలోకి వస్తే రోజు పండగే..
చిత్తూరు: వైయస్‌ జగన్‌ సీఎం అయితే ప్రతిరోజు పండుగేనని ప్రజలంతా భావిస్తున్నారు. సంక్రాంతి పండుగ నాడు కూడా పెద్ద ఎత్తున ప్రజా సంకల్పయాత్రలో ప్రజలు భాగస్వాములయ్యారు. రాజన్న బిడ్డ అడుగులో అడుగువేస్తూ.. భోగి పండుగను జననేతతో జరుపుకుంటున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నెన్నూరు నుంచి ప్రారంభమైన 62వ రోజు కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నెన్నూరు గ్రామ ప్రజలు జననేతకు రంగు రంగు ముగ్గులు, గొబ్బెమ్మలతో స్వాగతం పలికారు. ఊరంతా ఏకమై రాత్రంతా కష్టపడి జగనన్న తిరిగే వాడలను సుందరంగా ముస్తాబు చేశారు. జననేత సీఎం కావాలని అనంతపురం జిల్లా రాప్తాడు నుంచి పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. జనం మధ్యలో సిరిసంపదల సంక్రాంతి పండుగ చేసుకుంటున్నాడు కాబట్టే వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జననాయకుడు అయ్యాడని ప్రజలంతా అభిప్రాయపడుతున్నారు. జననేతను కలుసుకునేందుకు, ఆయనకు తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలంతా పెద్ద ఎత్తున తరలివచ్చారు. పండుగ పూట జన సందోహం మధ్యలో జననేత పాదయాత్ర కొనసాగుతుంది. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top