ఇళ్లు నిర్మించుకున్నా బిల్లులు అందలేదు

వైయస్‌ జగన్‌ను కలిసి పొగిరి గ్రామ మహిళలు
శ్రీకాకుళం: ఇళ్లు నిర్మించుకుకొని నాలుగేళ్లు అయినా ఇప్పటికీ బిల్లులు అందలేదని పొగిరి గ్రామ మహిళలు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి మొరపెట్టుకున్నారు. పాదయాత్రలో వైయస్‌ జగన్‌ను కలిసి మహిళలు పలు సమస్యలను జననేతకు వివరించారు. సంక్షేమ పథకాలు అందడం లేదని, ఇళ్లు నిర్మించుకున్నా బిల్లులు ఇవ్వడం లేదని, డ్వాక్రా రుణమాపీ జరగలేదని, పసుపు కుంకుమ డబ్బులు కూడా రుణాలకే జమ చేసుకుంటున్నారని వాపోయారు. అదే విధంగా అగ్రిగోల్డ్‌ డిపాజిట్లు ఇప్పించాలని కోరారు. మన ప్రభుత్వం వచ్చిన తరువాత అందరికీ న్యాయం చేస్తామని వైయస్‌ జగన్‌ వారికి భరోసా ఇచ్చారు. 
 
Back to Top