వైయస్ జగన్‌కు మొరపెట్టుకున్న, వృద్ధురాలు,వికలాంగులువిజయనగరంః టీడీపీ పాలనలో సంక్షేమ పథకాలు అందక నానా ఇబ్బందులు పడుతున్నారు. పింఛన్లు రావడంలేదని వృద్ధులు,వికలాంగులు ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్ జగన్‌ను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు.75 సంవత్సరాల వృద్ధురాలికి వేలిముద్ర పడటం లేదనే సాకుతో రేషన్‌ను నిలుపుదల చేశారు.పింఛను కూడా ఇవ్వడంలేదన్నారు. ఆ వృద్ధురాలి మనవళ్లు మాట్లాడుతూ వీఆర్వోకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదన్నారు. అంగ వైకల్యంతో బాధపడుతున్నవారికి కూడా పింఛన్లు ఇవ్వడంలేదన్నారు. అర్హత వున్నా ఆదుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.