అరకొరగా నష్టపరిహారం..

వైయస్‌ జగన్‌కు మొరపెట్టుకున్న తోటపల్లి నిర్వాసితులు
విజయనగరంః తోటపల్లి ప్రాజెక్టు బాధితులు వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు.నష్టపరిహారం సరిగ్గా అందలేని, కొంతమందికి మాత్రమే అరకొరగా ప్యాకేజీలు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. పరిహారంతో ఇళ్లు కూడా కట్టుకోలేకపోయామని వాపోయారు. రాష్ట్రంలోని ఎక్కడ లేని అధ్వాన్నమైన స్థలాన్ని తోటపల్లి నిర్వాసితులకు ఇచ్చారన్నారు. కోట్ల రూపాయాలు పెట్టి భూమిని లెవల్‌ చేస్తామని చెప్పి అధికారులు, ప్రజాప్రతినిధులు మభ్య పెట్టారన్నారు. కాలయాపన చేస్తున్నారనే తప్ప న్యాయం జరగడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 5 సంవత్సరాలు పూర్తికావడంతో మెటిరియల్‌ కాస్ట్‌ పెరిగిపోయిందన్నారు. నిర్వాసితులంతా అగ్యమగోచర పరిస్థితుల్లో ఉన్నామన్నారు.
Back to Top