శతాబ్దకాలంలో వైద్యం అందిస్తున్నాం..

విజయనగరం: శతాబ్దకాలంగా లెప్రసీ రోగులకు సేవలు అందిస్తున్నా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం లేదని సాలూరు ఫిలదెల్ఫియా వైద్యులు అన్నారు. సాలూరు నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఫిలదెల్ఫియా వైద్యులు కలిశారు. ఈ మేరకు వారి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు ఆస్పత్రి ప్రతినిధి లాజరస్‌ మాట్లాడుతూ.. 112 సంవత్సరాలుగా లెప్రసీ రోజులకు సేవలు అందిస్తున్నామని, ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించి మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదన్నారు. ప్రతి నెల 60 నుంచి 70 మంది రోగులకు వైద్యం అందిస్తున్నామన్నారు. ఇవి కాకుండా సుమారు వంద మంది కొత్తగా చికిత్స పొందుతున్నారన్నారు. కుష్టు వ్యాధి గ్రస్తులకు ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం అందించాలని, వారిని ఆదుకునేందుకు కొత్త పథకాలు ప్రవేశపెట్టాలని కోరామన్నారు. తన విజ్ఞప్తులను విన్న వైయస్‌ జగన్‌ సానుకూలంగా స్పందించినట్లు లాజరస్‌ చెప్పారు. 
 

తాజా వీడియోలు

Back to Top