కన్నబిడ్డల ఆదరణ కరువై..

నెల్లూరు: ‘అయ్యా.. నా భర్త రెండేళ్ల క్రితం మరణించాడు. కన్నబిడ్డల ఆదరణ కరువై గ్రామంలోనే వేరే ఇంట్లో నివాసముంటున్నా. కూలి పనులకెళ్లేందుకు శరీరం సహకరించక జీవనాధారం కష్టమై పెన్షన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నా. అదిగో ఇదిగో అంటున్నారే కానీ ఇప్పటికీ మంజూరు చేయలేదు’ అంటూ ఊటుకూరుకు చెందిన రమణమ్మ వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదంది. జననేత స్పందిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక నేతలను ఆదేశించారు. మనందరి ప్రభుత్వం రాగానే రూ.2 వేలు పింఛన్‌ అందజేస్తామని రమణమ్మకు ధైర్యం చెప్పారు. 

తాజా ఫోటోలు

Back to Top