వైద్యం అందించకుండా ఇంటికి పంపేశారు

నెల్లూరు: రోడ్డు ప్రమాదంలో రెండుకాళ్లు విరిగిపోవడంతో సరైన వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నట్లు తుమ్మూరుకు చెందిన బాధితుడు పి.రత్నయ్య  వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశాడు. 2016లో జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు విరిగాయని, ఎన్టీఆర్‌ వైద్యశ్రీ కింద ఆస్పత్రిలో చేర్చుకుని పూర్తిస్థాయి వైద్యం అందించకుండా ఇంటికి పంపేశారని తెలిపాడు. దీంతో కూలికి వెళ్లలేక, ఇద్దరు బిడ్డలను పోషించలేకపోతున్నానని వాపోయాడు. స్పందించిన జననేత జగన్‌ వెంటనే బాధితునికి ఉచితంగా వైద్యం అందించే ఏర్పాట్లు చేయించారు.
Back to Top