ఉద్యోగ భద్రత కల్పించాలి

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలల్లో (ఏపీఆర్‌ఎస్‌) కాంట్రాక్టు రిసోర్స్‌ టీచర్స్‌ (సీఆర్‌టీ)గా పనిచేస్తున్న ఉపాధ్యాయుల్ని క్రమబద్ధీకరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వాల్మీకిపురానికి చెందిన అరుణకుమారి, సోఫియాబేగం తదితరులు ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా వాల్మీకిపురం వద్ద వారు ఆయనను కలిసి సమస్యలు ఏకరువు పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఆర్‌టీలకు బేసిక్‌ వేతనాలు ఫిక్స్‌ చేసిన ఘనత అప్పటి ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖర రెడ్డిదేనన్నారు. రాష్ట్రంలో ఉన్న 76 గురుకుల పాఠశాలల్లో 236 మంది సిబ్బంది 2001 నుంచి సీఆర్‌టీలుగా పనిచేస్తున్నారని, తమను రెగ్యులరైజ్‌ చేయడానికి ప్రభుత్వం చొరవ చూపడం లేదని వాపోయారు. 
Back to Top