ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి

  
గుంటూరు :‘అన్నా.. ఏళ్ల తరబడి అవుట్‌ సోర్సింగ్‌లో పనిచేస్తున్న వర్కర్లను పర్మినెంట్‌ చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి’ అని కోరుతూ మంగళగిరికి చెందిన గాజుల ఝాన్సీరాణి జననేతను కోరారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయ‌స్ జగన్‌ను కలసి వినతిపత్రం అందజేశారు. తాను పదేళ్లుగా బీసీ సంక్షేమ శాఖలో పనిచేస్తుంటే రూ.10 వేలు మాత్రమే జీతం వస్తోందన్నారు. పర్మినెంట్‌ ఉద్యోగులకు మాత్రం రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకూ వేతనాలు ఇస్తున్నారన్నారు. చేసే పని ఒకటే అయినా తమకు మాత్రం తీరని నష్టం జరుగుతోందన్నారు. మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే న్యాయం చేస్తానని వైయ‌స్ జ‌గన్‌ భరోసాఇచ్చారు.

Back to Top