పెన్షన్‌ అడిగితే కాళ్లు పట్టుకోమంటున్నారు

అనంతపురం:

నా పేరు కుల్లాయప్ప, మాది బత్తులపల్లి గ్రామం. దివంగత మహానే వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో నాకు వికలాంగుల పెన్షన్‌ కింద రూ. 5 వందలు వచ్చాయి. చంద్రబాబు రాగానే నాకు పెన్షన్‌ రాకుండా చేశాడు. అధికారులకు అర్జీ పెట్టుకుంటూ జన్మభూమి కమిటీ సభ్యుల దగ్గరకు వెళ్లండి.. ఎండీఓ, ఎమ్మార్వో ఆఫీస్‌ అంటూ తిప్పుతున్నారు. కాళ్లు పట్టుకోండి అని మాట్లాడుతున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్‌కు వాళ్ల కాళ్లకు మేము ఎందుకు పట్టుకోవాలి. వైయస్‌ఆర్‌ సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సార్‌ను కలిసి మా సమస్యను చెప్పుకున్నాం. అన్న వస్తున్నాడని చెప్పండి.. అన్న వచ్చినాక మాకు మంచిరోజులు వస్తాయని చెప్పండి అని వైయస్‌ జగన్‌ చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి వైయస్‌ జగన్‌ సార్‌ పెన్షన్‌ ఇస్తామన్నారు. ఆయన మీద మాకు నమ్మకం ఉంది. 

Back to Top