కర్నూలు: ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇంటికో ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతి ఇ స్తామన్నారు. నాలుగేళ్లు అయినా ఇంతవరకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఆదర్శరైతులను తెలుగుదేశం ప్రభుత్వం రోడ్డున పడేసిందని పలువురు ఆదర్శ రైతులు వైయస్ జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. కోవెలకుంట్ల మండలం కంపమల్ల మెట్ట వద్ద ఆదర్శ రైతుల సంఘం మండల అధ్యక్షుడు శివశంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్రగా వస్తున్న ప్రతిపక్షనేతను కలిశారు. నాడు వైయస్‌ఆర్ ఆదర్శ రైతులను నియమిస్తే చంద్రబాబు తమను తొలగించి కుటుంబాలను రోడ్డున పడేశారని వాపోయారు. వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదర్శరైతులకు న్యాయం చేస్తామని వైయస్ జగన్ భరోసా ఇచ్చారు.<br/>