పింఛ‌న్ రాదు పొమ్మంటున్నార‌న్నా..

 

అన్నా.. నేను ఆటో డ్రైవర్‌ని, నాకు ఇద్దరు కుమార్తెలు.. ఎనిమిదేళ్ల నా పెద్ద కుమార్తె హుమేరాకు పుట్టుకతో కంటిచూపు లేదు. మాటలు వినబడకపోవడంతో పాటు మతిస్థిమితం కూడా సరిగా లేదు. సదరం క్యాంపునకు వెళ్తే 40 శాతమే వైకల్యం ఉన్నట్లు ధ్రువీకరించారు. ఆ సర్టిఫికేట్‌ను అధికారులకు చూపి వికలాంగ పింఛన్‌ అడిగితే రాదు పొమ్మంటున్నారు.. అంటూ అనంతపురం రూరల్‌ మండలం వైయ‌స్ఆర్‌ కాలనీకి చెందిన పర్వీన్, ఇస్మాయిల్‌ దంపతులు ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌ ఎదుట కన్నీటిపర్యంతమయ్యారు. తమ బిడ్డకు పింఛన్‌ వచ్చేలా చూడాలని వేడుకున్నారు. 

Back to Top