<strong>వైయస్ జగన్‌కు అరటి రైతుల మొర...</strong>విజయనగరంః వైయస్ జగన్‌ను జీఎంవలస అరటి రైతులు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు.తిత్లీ తుపాను ప్రభావంతో పంట నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్సూ్యరెన్స్ కంపెనీలు నష్టపరిహారం ఇవ్వకుండా మోసం చేశాయని ఫిర్యాదు చేశారు.ఎకరానికి 2వేలు ప్రీమియం చెలిస్తే 40 వేల రూపాయాలు బీమా సౌకర్యం కల్పిస్తామని చెప్పి ఇన్య్సూరెన్స్ కంపెనీ మోసం చేసిందన్నారు.మూడు మండలాలలో సుమారు 200 ఎకరాలకు బీమా చేశామన్నారు. అధికారులు కూడా స్పందించడం లేదన్నారు.వైయస్ జగన్ పరిశీలించి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారని రైతులు తెలిపారు. <br/>