ఇందిరమ్మ ఇళ్లు

వైఎస్సార్ వజ్ర సంకల్పానికి నిదర్శనం పేదలకు పక్కా ఇళ్లు పథకం. ఇళ్లు లేని నిరుపేదలకు సొంతింటి కలను నిజం చేసేలా మహానేత ప్రవేశ పెట్టిన పేదలకు ఇళ్లు పథకం లక్షలాది కుటుంబాలకు మేలు చేకూర్చింది. ప్రారంభించిన ఐదేళ్లలోనే 47 లక్షల ఇళ్లను నిర్మించి లబ్దిదారులకు అందించారు

వైఎస్సార్. గుడిసెలే లేని రాష్ట్రంగా ఆంధప్రదేశ్ తయారు చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు వైఎస్సార్. అందుకే 2004 లో 500 కోట్లు ఉన్న గృహనిర్మాణ బడ్జెట్ ను 2009 ఆర్థిక సంవత్సరానికి 5000 కోట్లకు పెంచారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి ఏటా 20 లక్షల ఇళ్లను నిర్మించేలా ప్రాణాళికలు రూపొందించారు. రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా ఇళ్ల మంజూరు ఉండేలా చర్యలు తీసుకున్నారు. లబ్దిదారుల ఎంపిక నించి, ఇళ్లు, నిధుల మంజూరు వరకూ అన్నీ పారదర్శకంగా ఉండటంతో లబ్దిదారుల్లో అంతులేని విశ్వాసం కలిగింది. అల్ప, మధ్యతరగతి ఆదాయ వర్గాలకు వైఎస్ అందించిన పక్కా ఇళ్ల పథకం కల్పతరువుగా మారింది.  

Back to Top