రుచీపచీ లేని రాతలు

రూ.40తోనే నాణ్యతలేని భోజనం పెట్టింది మీ బాబే 

రోగులకు పౌష్టికాహారం అందించడంపై సీఎం జగన్‌ ప్రత్యేక శ్రద్ధ 

డైట్‌ చార్జీలు రూ.80కు పెంపు  

ప్రభుత్వస్పత్రుల్లో రోగులను గాలికి వదిలేసిందని రామోజీ గగ్గోలు 

అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రుల రూపురేఖలు మారాయి. అత్యాధునిక వైద్యం అందుతోంది. గ్రామాలు, వార్డుల చెంతకు వైద్యం చేరింది. డాక్టర్లే ప్రజల గుమ్మం వద్దకు వచ్చి ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. మందులకు కొదవ లేదు. విలేజ్, వార్డు క్లినిక్‌లు ఏర్పడ్డాయి. ఇక ప్రధానాసుపత్రుల్లో సేవలు కార్పొరేట్‌ స్థాయిని తలపిస్తున్నాయి. గడచిన ఐదేళ్ల సీఎం జగన్‌ పాలనలో నాడు–నేడు, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ బలోపేతం, డైట్‌ చార్జీల పెంపు ఇలా అనేక సంస్కరణలతో ప్రభుత్వాస్పత్రులు అభివృద్ధి చెందాయి. 

ప్రభుత్వ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచి్చన జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో అభిమానం వెల్లువెత్తుతోంది. ఇది రుచించని ఈనాడు రామోజికి ఆసుపత్రుల్లో అందిస్తున్న రుచికరమైన భోజనం నచ్చలేదు. తన బాబు పాలనలో రుచీపచీలేకుండా వండినా, ఆ ఐదేళ్లలో రోగుల మెనూ ఛార్జీ రూ.40 మించకపోయినా, మూడుపూటలా భోజనం అందించకపోయినా ఈ ‘పచ్చ’రోగికి వెచ్చగా ఉంది. జగన్‌ పాలనలో మెనూ చార్జి రూ.80కి పెంచి రుచితో పాటు పౌష్టికాహారాన్ని అందిస్తున్నా రామోజీకి చప్పగానే ఉంది. అందుకే ‘బటన్ల బడాయి.. రోగుల బువ్వకూ బకాయి’ అంటూ రుచీపచీలేని ఓ కథనాన్ని వండేశారు. 

బాబు పాలనలో ఇదీ గతీ 
2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం ఒక్కో రోగికి రూ.40తో భోజనం పెట్టేది. ఇది కూడా 2011లో నిర్దేశించిన ఖర్చు. ఇంత తక్కువ ధరతో ఎలా వీలవుతుందన్న ఆలోచన కూడా అప్పట్లో బాబుకు రాలేదు. ఆ ఐదేళ్లలో ఒక్కసారి కూడా డైట్‌ చార్జీల పెంపుపై బాబు దృష్టి పెట్టిన పాపాన పోలేదు. రోజులో ఒక పూట మాత్రమే కోడిగుడ్డు అందించేవారు. ఇక అప్పట్లో వైద్య సేవల గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. గుంటూరు జీజీహెచ్‌లో చిన్నారిని ఎలుకలు కొరికి చంపిన దుర్ఘటనే బాబు పాలనలో కునారిల్లిన వైద్య రంగానికి పెద్ద నిదర్శనం.   

జగన్‌ పాలనలో ఇదీ పురోగతి 
2019లో సీఎం జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఈ క్రమంలో ఆస్పత్రుల్లో చేరిన రోగులు త్వరగా కోలుకోవాలంటే నాణ్యమైన వైద్య సేవలతో పాటు, పౌష్టికాహారం అవసరమని గుర్తించారు. ఇందులో భాగంగా రూ.80కు డైట్‌ చార్జీలను పెంచారు. రోగులకు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అందించేందుకు ప్రత్యేకంగా ఒక మెనూ రూపొందించారు. రూ.100 తో గర్భిణులకు నిర్దేశించిన మెనూతో పాటు, అదనంగా చిక్కీలు, రాగి జావ, టీబీ, ఎయిడ్స్, మానసిక రోగులకు హై ప్రొటీన్‌  డైట్‌ను అందిస్తున్నారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మూడు పూటలా రోగులందరికీ కోడిగుడ్డు ఇస్తున్నారు.  

మెనూలో మార్పులు ఇలా 
టీడీపీ ప్రభుత్వంలో రోగికి రోజుకు మూడు పూటలా ఆహారం కోసం రూ.40  
బ్రేక్‌ ఫాస్ట్‌: బ్రెడ్, పాలు 
మధ్యాహ్న భోజనం: అన్నం, సాంబారు, వెజ్‌ కర్రీ, గుడ్డు, అరటిపండు, మజ్జిగ 
రాత్రి భోజనం: అన్నం, సాంబారు, వెజ్‌ కర్రీ, మజ్జిగ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రోగికి రోజుకు మూడు పూటలా ఆహారం కోసం రూ.80 ఖర్చు 
బ్రేక్‌ ఫాస్ట్‌: ఉప్మా, కిచిడీ, ఇడ్లీ, పొంగలి, కోడిగుడ్డు, పాలు 
మధ్యాహ్న భోజనం: అన్నం, సాంబారు, ఆకుకూర పప్పు, అరటిపండు, మజ్జిగ, వెజ్‌ కర్రీ, గుడ్డు
రాత్రి భోజనం: అన్నం, సాంబారు, పప్పు, అరటిపండు, మజ్జిగ, వెజ్‌ కర్రీ, సంగటి, చపాతీ(డయాబెటీస్‌ రోగులకు), గుడ్డు

Back to Top