వికారి నామ సంవత్సరం వింతలు ..

 

వికారి నామ సంవత్సరంలో వింతలు జరుగుతాయని జ్యోతిష్యులు చెప్పిన మాట నిజం అవుతోంది. రాష్ట్రంలో ఎప్పుడూ చూడని, వినని విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. 

బాబు జైలు జపం

వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట అయిన చంద్రబాబు ఎన్నికల రణరంగంలో తన ఓటమిని ముందుగా ఒప్పేసుకోవడం నిజంగే వింతలకే వింత. నన్ను జైల్లో పెడతారు. రక్షించండి తమ్ముళ్లూ అంటూ పబ్లిక్ గా భయంతో వణికిపోవడాన్ని చూస్తున్నారు తెలుగు ప్రజలు. మోసానికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా, వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండే బాబు ఈ వికారి నామ సంవత్సరంలో తాను బికారిని కాబోతన్నాడని గ్రహించేయడం ఈ సంవత్సరం తెచ్చిన ఫలితం అనుకోవాలేమో!

భంగపడ్డ పవన్

తెరమీద తప్ప మరెక్కడా హీరో కానని తెలియని పవన్ తన పవర్ తెర మీద తప్ప మరెక్కడా పనిచేయదని తెలుసుకున్న ఘటన ఈ కొత్త సంవత్సరంలో జరిగింది. అభిమాని కాళ్లు లాగితే వెల్లకిలా పడి వెన్నునొప్పి తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ వేగంగా వెళ్లి హాస్పిటల్ బెడ్ మీద చేరాడు. ఇదేమిటి ప్రతిపక్ష నేతపై కత్తితో హత్యాయత్నం జరిగితేనే ఓస్ అంతేనా అని వెకిలిగా నవ్విన ఈ ఆరడుగుల బుల్లెట్ హీరో బుల్డోజర్ గుద్దిన బ్రాండెడ్ కార్ లా వెళ్లి హాస్పిటల్ బెడ్ మీద పడ్డాడు. కాస్త కిందపడితేనే ఇంత కిందామీదా కావాలా కాస్త వెన్ను దులుపుకుని ముందుకు పోతే పోలా అంటున్నారు సేన సైనికులు. కానీ ఎక్కడా పవనానికి ధైర్యం చాలడం లేదు. అరగంట గట్టిగా నడిచి ఆపసోపాలు పడటం, తిరుమల కొండ ఎక్కలేక అగచాట్లు పడటం ఇప్పుడు ప్రచారంలో ఏకంగా కిందే పడిపోవడం ఇవన్నీ వేటికి సూచనలా అని ఆలోచనలో పడిపోతున్నాడట పవన్ కళ్యాణ్. 

ఈ వికారి నామ సంవత్సర ఉగాది వికారభావాల వారిని వెనక్కి నెట్టి అసలైన వీరులకు పట్టం గడుతుందని చెబుతోంది పంచాగం. పగలు రాత్రి, ఎండ వానా అన్న తేడా లేకుండా జనం కోసం జగన్ చేసిన తపస్సును మెచ్చి ప్రజలు, ప్రకృతి, కాలం, దేవుళ్లూ అందరూ సహకరిస్తున్నారు. విజయోస్తు అని దీవిస్తున్నారంటున్నారు పండితులు.   

   

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top