ఉరేసుకున్న ఊసరవెల్లిపాపం చిన్ని బల్లి. తొండకది చెల్లి. రంగుల లోకం సంగతి దానికి తెలియదు. భయమో, కోపమో వస్తే వర్ణం మారే తన వరస ఎవ్వరికీ కీడు చేయదు. ఆకుపై ఆకులా, చెట్టుపై చెట్టులా, నేలపై మట్టిలా కలిసిపోవడమే దానికి తెలిసిన విద్య. రెండు రోజులుగా సోషల్ మీడియాలో, ఎల్లో మీడియాలో ఓ ప్రచారం చూసి అది కలత చెందింది. ఇది నాఖర్మ అంటూ కుంకుడు కొమ్మ కు ఉరేసుకు చావబోయింది. పాపం దాని బాధేమిటో చూడండి...
జీవుల్లో నా లాగా రంగు మార్చుకోగల ప్రాణులు భూమ్మీదైతే లేవు. ఊసరవెల్లి గా నా పేరు తీరు ప్రపంచానికి తెలుసు. నా ప్రత్యేకతతోనే కదా నా ఉనికి. అలాంటిది ఇప్పుడు నన్ను ఎవ్వరూ ఊసర వెల్లి అని పిలవడంలేదు. బాబు...చంద్రబాబు, ఊసరవెల్లి బాబూ అంటూ పిలుస్తున్నారు. నా పేరు, ఉనికి, నా స్పెషాలిటీ అన్నీ మంట కలిసాక ఈ భూమ్మీద నేను బతికుండి ఏం లాభం అంటూ ఉరేసుకుంటోందట ఊసరవెల్లి.
అవును మరి ప్రకృతి ధర్మంగా ఊసరవెల్లి ఆరు రంగులు మారిస్తే అవసరం కోసం చంద్రబాబు అరవై ఆరు రంగులు మారుస్తున్నాడు. ఎప్పుడు ఏ రంగులోకి మారతాడో తెలియదు. ఎప్పుడు ఏ పార్టీకి జై కొడతాడో తెలియదు. వామపక్షాలు, బిజెపి, టిఆర్ఎస్,జనసేన ఇప్పుడు కాంగ్రెస్. అయితే చిత్రమేంటంటే పొత్తుకుముందు పొత్తుకు తర్వాత బాబు కళాకళలు చూసే ఊసరవెల్లి కన్నీరు పెట్టుకుంటోంది. రంగు మార్చడం అంటే కలర్ ఛేంజ్ కాదు...కేరెక్టర్ ఛేంజ్ ....మనిషి ఛేంజ్...మాట ఛేంజ్...ఇన్నిమార్పులా! దెయ్యమన్నవాళ్లు దేవతలు అవుతారా? నాశనం చేసినవాళ్లు ప్రజాస్వామ్యకాముకులౌతారా? సభలు పెట్టి కాంగ్రెస్ మీద పాటకట్టి తిట్టించి, ఇప్పుడు అదే కాంగ్రెస్ కు వీణ ఇచ్చి జోలపాట పాడుతారా? ఇన్ని ఛేంజోవర్లు నావల్ల కాదు. అవసరానికో రంగు మార్చటం నాకు చేతగాదు...అందుకే ఈ ఉరి అంటోంది ఈ అరుదైన ప్రాణి. 
చంద్రబాబు కూడా నీ సంతతిలోంచి తప్పి ఇటు వచ్చినవాడే కాకపోతే రంగులే కాదు రక్తమూ, అవకాశవాద రాజకీయ తత్వమూ  అదనంగా ఉన్న ప్రాణి...కనుక నీవు ప్రాణాలు తీసుకోకని ఊసరవెల్లిని ఊరడించాల్సి వచ్చింది. 
 
Back to Top