గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఎలుకలు కరిచినందువల్ల చిన్నారి చనిపోయాడు. దాంతో చంద్రబాబు అలవాటు ప్రకారం దీని మీద అధ్యయనం కోసం ఒక కమిటీని విదేశాలకు పంపించింది. ఇద్దరు మంత్రులు, నలుగురు అధికారులతో కలిసిన కమిటీ అధ్యయనం చేయడానికి సింగపూర్ క పర్యటనకు వెళ్ళారు. అక్కన్నుంచి బాబు తో వీడియో కాన్ఫరెన్స్ చేశారు. <br/>`` మీరు మొత్తం ఎన్ని ఎలుకల్ని చూశారు? అవి ఏ సైజులో వున్నాయి?`` అని బాబు అడిగాడు.``మేము మొత్తం లెక్కపెట్టి 792 ఎలుకల్ని చూశాం సార్, అవి వేర్వేరు సైజుల్లో వున్నాయి. కొన్నింటికి తోక పొడుగ్గావుంది. కొన్నింటికి పొట్టిగా అన్నింటికి నాలుగు కళ్ళే వున్నాయి. కొన్ని ముందరి కాళ్ళపై లేచి నిలబడుతున్నాయి. మనం డెంటిస్ట్ని తీసుకెళ్ళడం మరిచి పోవడం వల్ల వాటి పళ్ళు ఎంత పదునుగా వున్నాయో తెలుసుకోలేకపోయాం``అని చెప్పాడో మంత్రి``గుడ్ ఎనాలిసిస్, ఒక్కో ఎలుకకి ఎన్ని పిల్లలు పుడుతున్నాయి?```` మీరు ఇలాంటి తెలివైన ప్రశ్న అడుగుతారని మాకు తెలుసుసార్, అందుకే ఇక్కడి శాస్త్రజ్ఞులతో స్టార్ హోటల్లో మీటింగ్ ఏర్పాటు చేశాం. వాళ్ళేమంటారంటే పునరుత్పత్తి విషయంలో ఎలుకలుకు పెద్దగా నియంత్రణా పద్ధతులు లేవట. చలికాలం కలుగుల్లోనే వుండడం వల్ల ఉత్పత్తి సంఖ్య పెరుగుతుందని అంటున్నారు.````అక్కడ ఎలుకలు మనుషుల్ని కరుస్తున్నాయా?````కరవడానికి ప్రయత్నిస్తున్నాయట, కానీ ఇక్కడి మనుషులు తెలివైన వాళ్ళు, వాళ్ళే ఎలుకల్ని కరిచి రోస్ట్ చేసుకుని తినేస్తున్నారు.````గుడ్ హాబిట్, అక్కడి మనుషులు పొలికటికల్‌గా చాలా అడ్వాన్స్‌డ్‌గా వున్నారు. కరవడానికి ఎవరొచ్చినా కాల్చుకుని తినేయడం రాజనీతి. నేను ఇదే మోరల్‌ని పాటించాను. మీరు అర్జ్ంట్‌గా ఒక పనిచేయండి. మనకి న్యూమరాలజీ ప్రకారం ఏడు అచ్చుబాటు కాదు. ఇంకో ఎనిమిది ఎలుకల్ని చూసి టోటల్ రౌండ్ ఫిగర్ 800 చేయండి. మీరు వెంటనే వెయ్యి పేజీల నివేదిక తయారు చేయండి. అది మీకూ నాకే కాదు. ఎవరికీ అర్థం కాకూడదు. ప్రభుత్వ నివేదికలు అలాగే వుండాలి.``అధ్యయన బందం తిరిగొచ్చింది. బాబు ప్రెస్‌మీట్ పెట్టాడు.``ఆంధ్ర రాష్ట్రంలో ఎలుకలు ఎక్కువయ్యాయని అనవసరంగా ప్రతిపక్షాలు గోల చేస్తున్నాయి. కానీ ఎలుకలనేది సామాజిక సమస్య, ప్రపంచ సమస్య, గ్లోబల్ కరణి నేపథ్యంలో ఎలుకలు ప్రపంచమంతటా విస్తరించాయి. ఈ విషయంపై విజన్ వున్నందువల్ల నేను వెంటనే స్పందించి సింగపూర్ కు అధ్యయన బందాన్ని పంపాను. దీనికి పాతిక కోట్లు ఖర్చుపెట్టాం. వందకోట్లు విలువైన సమాచారాన్ని సేకరించాను.ఎలుకలు నివారించడానికి ఒకటే మార్గం. ఆగ్నేయాసియా దేశాల్లో మాదిరి ఎలుకలు తినడం మనం అలవాటు చేసుకోవాలి. ఎలాగూ కరువుతో తిండిలేక జనం చస్తున్నారు కాబట్టి ఇది బెస్ట్‌ఫుడ్. జనం ఈ అలవాటుని పెంపోందించుకునే వరకూ ఎలుకల్ని అరికట్టడానికి ఒక సాఫ్ట్‌వేర్ కనిపెట్టాం. ఆస్పత్రుల్లో సెన్సర్స్ పెట్టడం వల్ల ఎలుకలు వచ్చిన వెంటనే అవి సిగ్నల్స్ ఇస్తాయి. అప్పుడు ఎవరి జాగ్రత్తలో వాళ్ళుంటారు. హార్డ్‌వేర్ ఏమంటే ప్రతి ఆస్పత్రికి ఒక పిల్లిని ఉచితంగా ఇస్తాం. ఎలుకలవేట అది కొనసాగిస్తుంది. పిల్లి సంరక్షణకి ఒక డిపార్ట్‌మెంటే పనిచేస్తోంది.`` అన్నాడు బాబు``ఇంత గోలెందుకు సార్? ఆస్పత్రిల్ని రిపేరు చేస్తే సరిపోతుందిగా``అడిగాడో విలేకరి``కొండని తవ్వి ఎలుకని పడితేనే, మా ప్రభుత్వానికి గుడ్‌విల్`` అని బాబు వెళ్ళిపోయాడు.- రాహుల్