పట్టువదలని విక్రమార్కుడు ఎప్పటిలాగే స్మశానానికి వచ్చాడు. చెట్టుకి వేలాడుతోన్న శవం వైపు నడుచుకు వెళ్తున్నారు. విక్రమార్కుని రాకను గమనించడంతోనే బేతాళుడు నవ్వాడు."ఏం విక్రమార్కా? ఏంటి చాలా ఉల్లాసంగా ఉన్నట్లున్నావు? ఏం జరిగిందేంటి?" అని అడిగాడు.దానికి విక్రమార్కుడు మొహం చిట్లించుకుని..."ఉల్లాసమా నా బొందా? తెలంగాణలో కల్తీ కల్లు తోటి...ఆంధ్ర ప్రదేశ్ లో ఆసుపత్రుల్లో ఎలుకలు..బయట కుక్కల తోటి...అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే ముఖ్యమంత్రులు మాత్రం విదేశాలు చుట్టి వస్తున్నారు..చూస్తేనే ఒళ్లు మండిపోతోందనుకో" అన్నాడు. దానికి బేతాళుడు నవ్వి..పెద్దల సంగతి మనకెందుకులేకానీ... ఇపుడో కథ చెబుతాను..సావధానంగా విను అని కథ చెప్పడం మొదలు పెట్టాడు."విక్రమార్కా...ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధించుకోవాలన్న లక్ష్యంతో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన జగన్ మోహన్ రెడ్డి గుంటూరు లో దీక్షకు సిద్ధమయ్యారు. గుంటూరు లోనే దీక్ష చేస్తామని చెప్పి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా రోజుల క్రితమే బహిరంగంగానే ప్రకటించారు. అక్కడి ఎస్పీ దృష్టికీ తీసుకెళ్లారు. తీరా దీక్ష ప్రారంభించడానికి రెండు రోజుల ముందు ప్రభుత్వం ఉన్నట్టుండి దీక్షకు అనుమతి నిరాకరించింది. దానికి పోలీసులు చెప్పిన కారణం మరీ సిల్లీగా ఉంది. ట్రాఫిక్ జామ్ అయిపోతుందని ... దీక్షా స్థలికి సమీపంలో ఆసుపత్రులు ఉన్నాయని...రోగులకు ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని ..పోలీసులు సాకులు చెప్పారు.అసలు రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ అసలే కష్టాల్లో ఉంది కదా. ఆర్ధికంగా బాగా ఇబ్బందులు పడుతున్నారు . మరో పక్క కేంద్ర ప్రభుత్వం ఇస్తామన్న ప్రత్యేక హోదానీ ఇవ్వలేదు..రాజధాని నిర్మాణానికి కానీ.. విభజన కాలం నాటి రెవిన్యూ లోటు కానీ ఇవ్వలేదు.ఇన్ని కష్టాల్లో ఉన్నప్పుడు..తాము ఎలాగూ ప్రత్యేక హోదా సాధించలేకపోతున్నారు కదా..కనీసం ప్రతిపక్షం ఆ ప్రయత్నం చేస్తోంటే ఎందుకు అడ్డుకుంటోన్నట్లు? వై.ఎస్.జగన్ దీక్ష కారణంగానూ..వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ పోరాటాల కారణంగానూ ప్రత్యేక హోదా వచ్చిందే అనుకో అది కూడా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబుకే లాభం కదా. మిగతా మూడున్నరేళ్లూ ప్రత్యేక హోదా రాయితీలతో అభివృద్దిని సాధించే అవకాశం దక్కుతుంది కదా. మరి చంద్రబాబు ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డిని దీక్షను అడ్డుకోవడం ద్వారా ప్రత్యేక హోదా రాకుండా ఎందుకు మోకాలడ్డుతోంది? దీనికి సమాధానం తెలిసీ కూడా చెప్పకపోయావో నీ తల వెయ్యి ముక్కలైపోతుంది" అని బేతాళుడు కథ ముగించాడు. విక్రమార్కుడు ఒక్క క్షణం నిశితంగా ఆలోచించి ..."బేతాళా నువ్వు చెప్పినట్లు జగన్ మోహన్ రెడ్డి దీక్ష వల్ల..కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి ప్రత్యేక హోదా ఇచ్చిందే అనుకో ఆంధ్ర ప్రదేశ్ అద్బుతంగా అభివృద్ది చెందుతుంది. ఉత్తరాఖండ్...హిమాచల్ ప్రదేశ్..రాష్ట్రాల్లా పారిశ్రామికంగా ఎంతో ప్రగతి సాధిస్తుంది. కానీ చంద్రబాబు నాయుడికి కావలసింది అది కాదు. ప్రత్యేక హోదా రావడం చంద్రబాబుకు సుతరామూ ఇష్టం లేదు.ఎందుకంటే ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం అభివృద్ది చెందుతుందే కానీ తాను కాదు. అదే ప్రత్యేక ప్యాకేజీ సంపాదించారనుకో..రాష్ట్రం ఎలా అఘోరించినా ఆయన మాత్రం మాబాగా అభివృద్ధి చెందచ్చు. ఎందుకంటే ప్రత్యేక ప్యాకేజీ వస్తే ప్రాజెక్టులను పట్టిసీమలా ఇష్టారాజ్యంగా అయినవాళ్లకి కేటాయించుకుని ముడుపులపై ముడుపులు అందుకోవచ్చు. ఆ కిక్ బ్యాక్స్ తో సింగపూర్ లో జల్సాలూ చేయచ్చు.హోదాతో అది సాధ్యం కాదని చంద్రబాబు అనుకుంటున్నట్లున్నారు.అందుకే ఆయన ఢిల్లీలోనే ప్రత్యేక హోదా వల్ల ఒరిగేదేమీ లేదని..అదేమీ సంజీవని కాదని ప్రత్యేక హోదాకు వ్యతిరేకంగా మాట్లాడారు.ఇక తన దీక్ష ద్వారా జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా రావడానికి కారణం అయ్యారనుకో...తెలుగు ప్రజలంతా జగన్ మోహన్ రెడ్డిని అభినందిస్తారు. అది జరిగితే తన రాజకీయ పునాదులే కదిలిపోతాయని చంద్రబాబు భయపడుతున్నారు. అందుకే జగన్ మోహన్ రెడ్డి దీక్షను అడ్డుకున్నారు. పైగా రోడ్డుపై దీక్షలు చేస్తే ఊరుకుంటామా అని చంద్రబాబు కొత్తగా అడుగుతున్నారు. అసలు టిడిపి వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావే ఓ సందర్భంలో రోడ్గుపై దీక్ష చేసిన సంగతి చంద్రబాబు మర్చిపోయినట్లున్నారు. లేదా గుర్తుండీ కూడా..జగన్ కు పేరు రాకూడదని దీక్షకు అడ్డుపడి ఉంటారు. " అని విక్రమార్కుడు ముగించాడు.విక్రమార్కుని సమాధానానికి సంతృప్తి చెందిన బేతాళుడు అమాంతం వెళ్లి చెట్టుకు వేలాడాడు.-వీర పిశాచి