ప్రహ్లాదుడు హిరణ్యకశపుడైతే


రాముడే రావణుడైతే అనే కతలు విన్నాం గానీ ప్రహ్లాదు హిరణ్యకశపుడెట్లా అవుతాడని మీరు ఆవేశపడి, ఆవేదన చెంది, ఆశ్చర్యం ప్రకటించి, ఆందోళన పడకండి. ఖర్మకాలితే ఫ్యూచర్ లో అలాగే జరిగే ఛాన్సుంది. కడుపులోనే సకల శాస్త్రాలూ నేర్చుకుని బయటకు వచ్చాడట ప్రహ్లాదుడు. అదే స్టైల్లో పుట్టినప్పటి నుంచే పరిపాలన గురించి తెలుసుకునే అవకాశం  మన ముఖ్యమంత్రి గారి చలవ వల్ల రేపటినుంచి పుట్టబోయే బిడ్డలకు కలుగుతోంది. ప్రహ్లాదుడు విష్ణుమూర్తి గురించి విని భక్తిలో పడిపోయాడు. ఇక బాబు చరిత్రను కడుపులో ఉండగా విని, పుట్టినప్పటి నుంచీ ఉగ్గుపాలతో విని పెరిగే శిశువులు ఎలా తయారౌతారో వేరే చెప్పాలా? హిరణ్య కశపుడికి జెరాక్స్ కాపీలా, రావణాసురుడికి మనవల్లా, తారకాసురికి తమ్ళుళ్లలా, దుర్యోధన దుశ్సాసనుల నకళ్లలా తయారౌతారు. 
పుట్టినప్పుడే వాళ్ల చెవిలో చంద్రబాబు చరిత్ర ఇలా ఊదబడుతుందట. 
సొంత వాళ్లకు వెన్నుపోటు పొడిచిన వాడు. పదవి కోసం పలు వేషాలు వేసే వాడు. ఒక్క మాటను కూడా జీవితంలో నిలబెట్టుకున్న చరిత్ర లేని వాడు. ఎప్పుడూ ఎవరో ఒకరి కాళ్లమీద పడి పొత్తులతో జిత్తులు చేసేవాడు. కులాల కుంపట్లతో చలికాచుకునేవాడు. గోడమీద పిల్లిలా, రెండు తలల పాములా మార్చి మార్చి మాట్లాడేవాడు. ఊసరవెల్లిలా రంగులు మార్చేవాడు. జాతి నుంచి జాతీయ పార్టీల దాకా అన్నిటినీ వాడుకుని కర్వేపాకులా తీసి పారేసేవాడు. బ్రీఫు చేస్తూ పబ్లిక్ గా దొరికి పట్టపగలే పారిపోయినవాడు. మంత్రదండం లేకుండానే మాయలెన్నో చేసి చూపేవాడు. కళ్ల ముందే కంచుకోటలు కట్టి క్షణాల్లో మాయం చేయగలవాడు. హామీలతో ఓట్లని, కోట్లతో ఎమ్మెల్యేలని కొనేవాడు. కన్నకొడుకును కమ్మగా పెంచి అడ్డదారిలో కుర్చీలో కూర్చోపెట్టినవాడు. దర్యాప్తు పేరెత్తితే దిక్కులు దద్దరిల్లేలా అరిచి గీపెట్టేవాడు. గట్టిగా ప్రశ్నిస్తే పరిగెత్తి పార్టీల కొంగుల చాటున దాక్కుని లీలలు చూపేవాడు. 
ఇలా బాబు గుణగణాల గురించి ఆయనగారి అనుచర అసుర గణాల గురించి ఆశావర్కర్లు అప్పుడే పుట్టిన శిశువల చెవుల్లో గంధర్వ గానం చేస్తూ ఉంటే ఘడియకో గూండా, నిమిషానికో నేరగాడు తయారవ్వక ఏమౌతారు చెప్పండి. పసి ప్రహ్లాదులను హిరణ్యాక్ష హిరణ్య కశపులుగా చేసిన ఘనత కూడా బాబుగారి చరిత్ర గానంలో కలిసి మారు మోగుతుంది. డౌట్ లేదు. 
 
Back to Top