హీటైస్ 

లోకీ డైనింగ్ టేబుల్ మీద కూర్చుని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు.
యు ఆర్ రైట్..మీరు కరెక్టుగానే చదివారు. నేను కరెక్టుగానే రాసాను.
లోకీ డైనింగ్ టేబుల్ పైనే కూర్చున్నాడు.
ఏం...కూర్చీకేమైనా కాళ్లిరిగాయా? అని డౌట్లొద్దు. 
కుర్చీలోంచి వంగి తినడం కంటే టేబుల్ మీద కూర్చుని వంగి తినడం వల్ల చాలా లాభాలుంటాయని లోకీ గుర్తించి అలా ప్రొసీడ్ అవుతున్నాడు.
ఇంతకీ డైనింగ్ టేబుల్ పైకెక్కి మరీ లోకీ ఆలోచించే సీరియస్ విషయం గురించి తెలుసుకుందాం. 
టేబుల్ మీద ఓ పక్క పాతిక రోటీలున్నాయి. మరోపక్క పళ్లెంనిండా అన్నం పప్పూ ఉన్నాయి. 
లోకీ ఆ రెంటివైపూ చాలా అయోమయంగా చూస్తున్నాడు.
అప్పుడే అక్కడికి ఎంట్రీ ఇచ్చాడు చెంబాబ్. 
ఏంట్రా కరకట్టకి ఆనకట్టకీ తేడా తెలీనట్టు చూస్తున్నావ్...అని అడిగాడు.
నువ్వేమో డైటింగ్ చేయమన్నావ్. డాక్టరేమో రోటీ తినమన్నారు. డైటీషియన్ సమతులాహారం తీసుకోమన్నారు.
అయితే ఇప్పుడేంటీ...
wheatలో Heat ఉంది కదా..Riceలో Ice ఉంది కదా రెండూ మిక్స్ చేసి తింటే సమతుల ఆహారం అయిపోతుందా అని ఆలోచిస్తున్నా అన్నాడు. 
అంతే
లోకీ పటాస్ చెంబాబ్ మటాష్ 

 

Read Also:రైతు కన్నీరు పెడితే దేశానికి మంచిది కాదని నమ్మిన వ్యక్తి వైయస్‌ జగన్‌

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top