అంతేగా...అంతేగా...

ఆల్ ఫెయిల్యూర్స్ మీటింగ్ ఒక‌టి జ‌రుగుతోంది. అందరూ త‌మ‌త‌మ ఫెయిల్యూర్స్ కి కార‌ణాలు అన్వేషిస్తున్నారు. ఆల్ అవుట్ ఎందుకు పెడుతున్నారో తెలీయ‌డం లేదు అంటోంది ఆడ‌దోమ మ‌గ‌దోమ‌తో. నువు వాళ్ల ర‌క్తం తాగ‌డం వ‌ల్లే అని ఆన్స‌ర్ చేయ‌లేక పోయింది మ‌గ‌దోమ‌. న‌న్నెందుకు కొట్టారో తెలీడం లేదు అంది కుంటి కుక్క‌. క‌న‌బ‌డ్డ‌వాళ్ల‌న‌ల్లా క‌ర‌స్తూపోయావ్ గా అందుకే కుక్క‌కాటుకు చెప్పుదెబ్బ న‌డుము విరిగి నువ్వు అబ్బా అంది మ‌రో సోద‌ర కుక్క‌.  బందెల దొడ్లో న‌న్నెందుకు క‌ట్టేసారో తెలీడం లేదు వాపోయిందో వ‌ద‌రుబోతు. అచ్చోసి తిరుగుతుంటే ఆంబోతును క‌ట్టేయ‌క ప‌సుపూ కుంకుమ తో పూజ చేస్తారా చిరాకు ప‌డ్డ‌దో పాడి ఆవు.  నేనెందుకు ఓడిపోయానో తెలియ‌డం లేదు క‌ళ్లు తుడుచుకుంటూ అన్నాడు నారాబు. న‌వాబులా ఫీలై నిరంకుశంగా పాలించావ్ గా అనుభ‌వించు అన్నారు ఆరుకోట్ల ఆంధ్రులు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top