రైతుల్ని ముంచే సంజీవ‌ని

రైతుస‌భ ఏర్పాటు చేశారు చంద్ర‌బాబు. అందులో ఆయన ప్రసంగం ఇలా సాగుతోంది.
``సోద‌రులారా నేను కూడా రైతునే, మీరంతా వ్య‌వ‌సాయం చేసి ఉన్న భూములు అమ్ముకుంటూ వుంటే, నేను వ్య‌వ‌సాయం చేయ‌కుండా 2 ఎకరాల నుంచి  2 వేల కోట్ల‌కు ఎదిగాను. అందుకే నేను వ్య‌వ‌సాయం దండ‌గ‌ని చెప్తాను. అయితే రైతులు ఓట్లు వేయ‌క‌పోతే పోట్లు త‌ప్ప‌వ‌ని  రుణ‌మాఫీ టోపి పెట్టాను. మీ కోసం ఏదో ఒక‌టి చెయ్య‌క‌పోతే నాకు నిద్ర ప‌ట్ట‌దు అందుకే చెరువు త‌వ్వించే సంజీవ‌ని ప‌థ‌కం ``అన్నాడు బాబు
`` బాబు గారు మీ ప‌థ‌కాల‌న్నీ  మాకు తెలుసు. వెనుక‌టికి మీ సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పం లో ఇజ్రాయిల్ టెక్నాల‌జీ పేరుతో దివాళా తీయించారు`` అన్నాడు రైతు
`` రైతుల్ని ఒక‌రు దివాళా తీయించాల్సిన అవ‌స‌రం లేదు . వాళ్ళు వ్య‌వ‌సాయం చేసేదే దివాళా తియ్య‌డానికి`` అన్నాడు బాబు
``ఎలుక‌కి పిల్లి ఎక్క‌డైనా మేలు చేస్తుందా? మీ గురించి మాకు అంతా తెలుసు కానీ ఇంత‌కూ ప‌థ‌కమేంటో చెప్పండి`` అన్నారు రైతులు.
``సంజీవ‌ని అంటే పొలాల్లో చెరువు త‌వ్వ‌డం అంటే ఒక హెక్ట‌రు స్థ‌లంలో ఒక చెరువు త‌వ్వుతాం.. వాన వ‌చ్చిన‌పుడు నీళ్ళు నిల్వుండి సాగుకు ప‌నికొస్తాయి.``
`` విన‌డానికి బాగానే ఉంది కానీ చెరువు ఇళ్ళ మ‌ధ్య మున్సిపాలిటీ వాళ్ళు పార్కుకి  స్థ‌లం వ‌దిలిన‌ట్టు పొలాల మ‌ధ్య ఎవ‌రూ చెరువుకి స్థ‌లం వ‌ద‌ల‌రుగా?``
``అదే మా ఐడియా కూడా పొలాల మ‌ధ్య ఎక్క‌డ చెరువు త‌వ్వాల‌నే విష‌యం తేల‌డానికి మా రెవిన్యూ వాళ్ళు ఒక నివేదిక సిద్ధం చేస్తారు. ఆ నివేదిక అన్ని శాఖ‌లు తిరిగి రావ‌డానికి మూడేళ్ళు ప‌డుతుంది. ఈ లోగా మా కార్య‌క‌ర్త‌లు చెరువులు త‌వ్విన‌ట్టు లెక్క‌లు చూపించి డ‌బ్బులు తినేస్తారు ఒక వేళ ఎక్క‌డైనా చెరువులు త‌వ్వినా ఆ నీళ్ళు ఎవ‌రు వాడుకోమ‌నే విష‌యంపై రైతులు కొట్టుకు చ‌స్తారు....``
`` వున్న చెరువుల‌కి రిపేరు చేయ‌కుండా లేని చెరువుల్ని త‌వ్వ‌డం బాగుంటుందా సార్‌``
`` నేనేది చేసినా బానేవుంటుంది.  గ‌తంలో ఇంకుడుగుంత‌ల్లో కోట్లు పోశాను. ఆ గుంత‌లు ఏమ‌య్యాయో ఎవ‌రికీ తెలియ‌దు. అందువ‌ల్ల భ‌గ‌వ‌ద్గీత‌లో ఏం చెప్పారు? ఫ‌లితం ఆశించ‌కుండా ప‌నిచేయ‌మ‌న్నాడు.``
`` మీకు రావాల్సిన ఫ‌లితం ఎలాగూ వ‌స్తుంది. మ‌ధ్య‌లో మునిగేది మేమే``
`` నేనున్నంత వ‌ర‌కూ మీకేం కాదు. పెన్నాన‌దితో బ్ర‌హ్మ‌పుత్రాన‌ది అనుసంధానం గురించి ప‌రిశోధిస్తాం``
`` బ్ర‌హ్మ‌పుత్ర నది ఎక్కడో అసోంలో ఉంది. ఇది ఎలా సాధ్యం సార్?``
‘‘ అదంతే, గోదావరి నుంచి చెంబుడు నీళ్లు తెచ్చి క్రిష్ణా నదిలో పోసి అనుసంధానం అయిపోయిందంటే నమ్మారు కదా. దీన్ని కూడా అలాగే నమ్మండి. ఇప్పుడు క్రిష్ణా తో పెన్నా నది అనుసంధానం అంటుంటే నమ్మేస్తున్నారు కదా’’
‘‘అయితే మాత్రం.. బ్రహ్మాపుత్ర నదికి మనకు సంబంధం ఏమిటి సార్’’
‘‘ ఏం సంబంధం వుండ‌క్క‌ర్లేదు అన్నింటిని అనుసంధానం చేసి వాట‌ర్‌గ్రిడ్ ఏర్పాటు చేస్తా. క‌రెంట్ ఎలాగూ పొలాల్లోకి వ‌చ్చేస్తుందో అలాగే పైపుల్లో  నీళ్ళు కూడా వ‌చ్చేస్తాయి``
``బాబూ గారూ మీరు నీళ్ళు ఎలాగూ ఇవ్వ‌ర‌ని మాకు తెలుసు. మాతో క‌న్నీళ్ళు పెట్టించ‌కుండా వుంటుంది అదే చాలు`` అని వెళ్ళి పోయారు.

తాజా ఫోటోలు

Back to Top