బుద్ధుల్లో ప‌చ్చ‌బుద్ధి వేర‌యా!

ఉప్పు క‌ప్పురంబు ఒక్క పోలిక‌నుండు

చూడ‌చూడ రుచుల జాడ‌వేరు

బుద్ధులందు ప‌చ్చ‌బుద్ధులు వేర‌యా...

ఆంధ్ర‌రాష్ట్ర‌పు ఖ‌ర్మ‌ప‌చ్చ‌జ‌న్మ‌!!!

నిజ‌మే క‌దా....అప్పుడెప్పుడో వేమ‌న చెప్పిన ప‌ద్యానికి క‌రెక్టుగా సరిపోతుంది నేటి టీడీపీ ప‌రిస్థితి. ఆ పార్టీలో అధ్య‌క్షుడి నుంచి మొద‌లు అటెండ‌ర్ వ‌ర‌కూ అంద‌రికీ అహంకారం అర‌చేతి మందాన బుర్ర‌ల్లో తిష్ట‌వేసుకుని ఉంటుంది. అందుకే నోరు ఇష్టం వ‌చ్చిన‌ట్టు అదుపు త‌ప్పి ప్రేలాప‌న‌లు పేలుతుంటుంది. వారికి ఎదురుతిరిగి ఎవ‌రు ప్ర‌శ్నించినా ఆ అహంకారం బుస‌లు కొడుతుంటుంది. మీ పార్టీ బ‌లంగా ఉన్న‌ప్పుడు రీపోలింగ్ పెడితే భ‌య‌మెందుకు అని సూటిగా ప్ర‌శ్నించిన విలేక‌రుల‌పై చిందులు తొక్కాడు సీఎం ర‌మేష్. ప‌దిరోజుల దీక్ష చేసినా పావుకిలో త‌గ్గ‌ని స్టామినా సీఎం ర‌మేష్ సొంతం. ఇదెలా అని అడిగిన‌ప్పుడు కూడా ఆయ‌న‌కు ఇలాగే తిక్క కోపం వ‌చ్చింది. అంతే మ‌రి రుణ‌మాఫీ జ‌ర‌గ‌లేద‌ని రైతులు అడిగితే, తుఫాను సాయం అంద‌లేద‌ని బాధితులు నిల‌దీస్తే చంద్ర‌బాబుకు కోపం వ‌స్తుంది.

డేటా దొంగ‌త‌నం చేసార‌ని తెలంగాణా పోలీసులు ప్ర‌శ్నిస్తే   లోకేషానికి కోపం వ‌స్తుంది. ఇసుక అక్ర‌మ‌ర‌వాణా చేయ‌కూడ‌దంటే చింత‌మ‌నేనికి కోపం వ‌స్తుంది. బ్యాంకుల‌కు పంగ‌నామం పెట్ట‌కూడ‌దు అంటే సుజనా చౌద‌రికి కోపం వ‌స్తుంది. ఏమిటో వారి త‌ప్పులు ఎత్తి చూపితే చాలు ఎక్క‌డ‌లేని కోపం న‌షాళానికి అంటుంతుంది. బుద్ధులందు ప‌చ్చ‌బుద్ధులు వేర‌యా అన్న‌ట్టు అలా అడిగిన వారిపై రెచ్చిపోవ‌డం ప‌చ్చ‌నేత‌ల అల‌వాటు. అందుకే సీఎం ర‌మేష్ కూడా నీకేమైనా బుద్ధుందా అంటూ మీడియాపై చిందులు తొక్కాడు. వారి బ‌లంపై వారుకున్న న‌మ్మ‌కం నిజం కాదా అని ప్ర‌శ్నించినందుకే సీఎం ర‌మేష్ కు అంత ఉడుకుమోత్త‌నం వ‌చ్చింది. త‌మ ఓట‌మిని, భ‌యాన్ని క‌ప్పిపుచ్చుకోలేక ఇలా ప్ర‌జ‌లపై, అధికారుల‌పై, మీడియాపై చిందులేయ‌డం పచ్చ‌నేత‌ల‌కు ప‌రిపాటి అయ్యింది. అధికారంతో అంద‌లం ఎక్కిస్తే బుద్ధి బుర‌ద గుంట‌లోకి లాగ‌డం అంటే ఇదేనేమో!

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top