బాబు ఉచిత జ్ఞానగుళికలు

 

చంద్రబాబు జ్ఞానభేరి మళ్లీ మోగింది. ఈ సారి దానికి ఒంగోలు వేదికైంది. ప్రపంచంలో మూడు ముఖ్యదేశాలు ఉంటాయిట. అమెరికా, ఇండియా, చైనా అని చంద్రబాబు శెలవిచ్చారు. మరి వాటిలో సింగపూరును ఎందుకు మినహాయించారో? ఇక ఇంగ్లీషు మాట్లాడేవాళ్లు ఎక్కువగా ఉండే దేశం ఇండియా అని చంద్రబాబు చెప్పగానే ఎక్కడ అందుకు నేనే కారణం అని అంటాడో అని విద్యార్థులంతా ఊపిరి బిగబట్టి విన్నారు.      

 ఇక ఇలాంటి జ్ఞాన గుళికలు మరిన్ని పంచారు చంద్రబాబు. దేశంలో అభివృద్ధి రెండంకెల్లో పరిగెత్తడానికి కారణం ఆర్థిక సంస్కరణలే అని శెలవిచ్చారు. నిజమే తెలుగుదేశం పార్టీ అన్నింట్లోనూ రెండంకెల వృద్ధీ సాధించిందని తెలంగాణా ఎన్నికలు ప్రూవ్ చేసాయి. కాకపోతే అవి రెండు అంకెలు కాదు రెండు అంకె మాత్రమే అని బాబుగారు స్పీచ్ లో కరెక్టు చేసుకోవడం మరిచిపోయారు.

జ్ఞాన పంపిణీ తర్వాత బాబు భేరి మొదలైంది. కార్యక్రమ ఆరంభంలో ముఖ్యమంత్రి రెండు చేతులతో మోగించిన భేరి కంటే ఇది ఇంకాస్త ఎక్కవ రీసౌండ్ ఇచ్చింది. ప్రపంచంలో తాజ్ మహల్ తర్వాత ఎపి అసెంబ్లీనే చూపిస్తారంటూ బాబు మరో అబద్ధాల భేరి ఆరంభించాడు. అభివృద్ధికి తానే చిరునామా అని చెప్పాడు. మహిళలు పేడ ఎత్తకుండా చేయడం చెత్తలోంచి సంపంద సృష్టించడం తన ఘనతే అన్నాడు. ఇక జాతీయ రాజకీయాలకు సెంటర్ పాయింట్ తానే అని ప్రకటించుకున్నాడు. అన్ని రాజకీయ పార్టీలను ఒక్కతాటిపైకి తెచ్చి కదలకుండా కూర్చోబెట్టానని, మొన్నటి పదో తారీకున మీటింగ్ నేనే పెట్టానని చెప్పుకొచ్చాడు. అరక్షణంలో అన్ని విశేషాలు అరచేతిలోకొచ్చే కాలంలో దిల్లీలో జరిగిన ఆల్ పార్టీ మీటింగ్ పార్లమెంట్ ముందు జరిగే సాధారణ సమావేశమని ఆ విద్యార్థులకు తెలియకుండా ఉంటుందా? ఇక బీజేపీ పార్టీ ఎక్కడా గెలిచే పరిస్థితే లేకుండా పోయింది అంటున్న చంద్రబాబు తెలంగాణాలో టీడీపీ కూడా మట్టిగొట్టుకుపోయింది కదా అని అదే విద్యార్థులు ఎదురు తిరిగి ప్రశ్నిస్తే ఏమయ్యేవాడో?

బాబు జ్ఞాన భేరిలో జ్ఞానం కంటే ప్రజలు తను ఏం చెప్పినా నమ్మేస్తారనే అజ్ఞానమే ఇంకా కనిపిస్తోంది. తెలంగాణాలో ఆ అజ్ఞానం తొలగిపోయింది..ఇక ఏపీలో తొలగడమే మిగిలింది. 

తాజా వీడియోలు

Back to Top