చంద్రబాబు తాను కొత్తగా నిర్మించిన రాజధాని భ్రమరావతిలో కాలుపెట్టాడు. పక్షులన్నీ కీచుగా అరిచాయి. పచ్చ జెండాలన్నీ రెపరెపలాడాయి. జై భ్రమరావతి జైజై భ్రమరావతి…భ్రమరావతి సామ్రజ్యాధినేత బాబేంద్రబలిగారికి స్వాగతం సుస్వాగతం అంటు మంది మాగధులు కేకలు పెడుతున్నారు.
చిరిగిన బట్టలతో, డొక్కలు ఎండిపోయి, దీనావస్థలో ఉన్న ప్రజలు బైట నుంచుని బాబేంద్రబలి చేస్తున్న భ్రమరావతి ఆరంభోత్సవాన్ని తొంగి తొంగి చూస్తున్నారు…మంత్రి నారాయణదేవ, కట్టరాజప్ప, లోకపీకాశ తదితరులందరూ బాబేంద్రబలితోపాటు భ్రమరావతి సౌందర్యాన్ని చూసి మురిసి ముక్కలైపోతున్నారు.
పెద్దపెద్ద భవంతులు, ఎత్తైన స్తంభాలు, పొడవాటి కారిడార్లు, వాటిమీద ఎర్రెర్రని తివాచీలు, వెడల్పుగా మెట్లు…ఓహో భెమరావతి అందమే అందం. ఇంత గొప్ప రాజధానిని కట్టించింది నేనే అనే గర్వంతో పెద్దపెద్ద అంగలేసకుంటూ లోపలికి వెళ్లాడు బాబేంద్రబలి. తను కోరినట్టు అద్భుతమైన రాజధాని భవనాలు డిజైన్ చేసి ఇచ్చినందకు గాజమౌళికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. సభా భవనంలోకి అడుగుపెట్టారు అందరూ. ఎదురుగా కాస్త ఎత్తైన వేదిక మీద పెద్ద సీటు ఉంది. బాబేంద్రబలి గారు వెళ్లి అందులో ఆసీనులవ్వండి అని కట్టరాజప్పగారు సాదరంగా ఆహ్వానించారు.
మళ్లీ అంగలేసుకుంటూ వెళ్లారు బాబేంద్రబలి. స్టైల్ గా సీటునే సింహాసనంగా ఫీలౌతూ కూర్చున్నారు. ఫెడేలున విరిగిపడింది సీటు. బాబేంద్రబలి పైనించి దొర్లుకుంటూ వచ్చి కిందపడ్డారు. నా సీటు, నా భ్రమరావతి…నా సీటు…నా భ్రమరావతి అంటూ లేచి కూచున్నారు బాబేంద్రబలి. ఎవరు…? ఎవరు నన్ను నా సీటులోంచి, నా కలల సామ్రాజ్యం భ్రమరావతి సీటులోంచి తోసేసింది అంటూ లేచి నించున్నారు.
ఏమైంది నాన్నారూ అంటూ లోకేష్, ఏమిటండి పీడకల ఏమన్నా వచ్చిందా అంటూ సతీమణి కంగారుగా అడిగారు చంద్రబాబుని. అదేమిటి నేనిక్కడున్నాను….నే గాజమౌళితో డిజైన్ చేయించి కట్టించుకున్న నా భ్రమరావతి ఏది….?అడిగాడు బాబు అయోమయంగా. అబ్బా నాన్నారూ అమరావతి మన జనం కోసం కల్పించి కట్టించే భ్రమరావతి కదా…మీరు కూడా అదే భ్రమలో పడితే ఎలా…జై మాహిష్మతి అనుకుని ముసుగేసుకు పడుకోండి…అని వెళ్లిపోయారు లోకేష్, భువనేశ్వరి. ప్రజలను భ్రమలో పెడుతున్నా అనుకుని నేనూ భ్రమలో పడిపోయానన్నమాట…అని అనుకుని ముసిముసిగా నవ్వుకుంటూ నిద్దరోయాడు బాబు.