అశోక్ బాబు రుణం తీర్చుకుంటున్న చంద్రబాబు

 


నాలుగేళ్లుగా చంద్రబాబు నాటకాలకు నర్తకుడిలా పని చేసాడు ఎపి ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు. అందుకు ప్రతిఫలంగా రాజకీయాల్లోకి రమ్మని ప్రేమగా ఆహ్వానించాడు చంద్రబాబు. విభజన సమయంలో ఉవ్వెత్తున సాగిన సమైక్య ఉద్యమాన్ని ఉన్నట్టుండి ఊసురోమనిపించినందుకు అశోక్ బాబుకు ఇప్పుడునజరానా ఇస్తున్నాడు బాబు. ఉద్యోగులకోసం పని చేస్తున్నట్టు నటిస్తూ చంద్రబాబుకు ఫేవర్ గా పని చేసినందుకు ఇప్పుడు ప్రతిఫలం అందిస్తున్నాడు. ఉద్యోగుల సంక్షేమాన్ని బాబు అవకాశవాదానికి తాకట్టు పెట్టినందుకు  అశోక్ బాబుకు ఏపీఎండీసి పదవిని ఆఫర్ చేస్తున్నాడు. కర్నాటక ఎన్నికల్లో చంద్ర కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసి, అక్కడి తెలుగువాళ్లతో తన్నులు తినబోయి చావుతప్పి కన్నులొట్టబోయి వచ్చినందుకు పరిహారంగా, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్సీ సీటు ఖరారు చేస్తున్నాడు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే వ్యక్తిని మళ్లీ ఎపీ ఎన్జీవో అధ్యక్షుడిగా ఎన్నికయ్యేలా చేస్తానని స్వామి భక్తిని ప్రదర్శిస్తున్న అశోక్ బాబుకు చంద్రబాబు ఇలా కానుకలు ఇస్తున్నాడు. నకీలీ సర్టిఫికెట్లతో పదోన్నతి పొందిన అశోక్ బాబుకు క్లీన్ చిట్ ఇప్పించేందుకు శాయ శక్తులా కృషి చేస్తూ అశోక్ బాబు రుణం తీర్చుకుంటున్నాడు చంద్రబాబు.  మరి నాలుగేళ్ల క్రితం బాబు చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మి ఓట్లేసిన కోట్లాదిమంది తెలుగు ప్రజలకు మాత్రం చంద్రబాబు మొండి చేయి చూపిస్తున్నాడు. ఉద్ధరిస్తాడని ఓట్లేసి గెలిపించిన వారి రుణం తీర్చుకోవాలని ఈ రోజుకీ అనిపించడం లేదు చంద్రబాబుకు.  


Back to Top