వాలంటీర్ వ్యవస్థకి మంగళం!

అమ‌రావ‌తి:  అనుకున్న‌ట్లుగానే చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌కు మంగ‌ళం ప‌ల‌క‌నుంది. వాలంటీర్లకి చంద్రబాబు మార్క్ వెన్నుపోటు పొడ‌వ‌నున్నారు. జులై 1న సచివాలయ ఉద్యోగులతో పెన్షన్ పంపిణీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తూ.. రూ.10 వేలు జీతం ఇస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన చంద్ర‌బాబు..ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థకి మంగళం పాడే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. చంద్ర‌బాబు నిర్ణ‌యంతో భ‌విష్య‌త్‌లో సంక్షేమ ప‌థ‌కాలు గ‌డ‌ప వ‌ద్ద అందే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉన్నాయి. 

Back to Top