ఫీజు రీయింబర్సుమెంటు

పేదరికం పెద్ద చదువుల కలకు ఆటం కాకూడదు అన్నారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. కుటుంబంలో ఉన్నత చదువులు చదివిన వారుంటే ఆ కుటుంబం పేదరికం నుంచి బయటపడ్డట్టే అన్నది ఆయన సిద్ధాంతం. అదే మెరుగైన సమాజానికి తొలిమెట్టు అంటారు వైఎస్సార్. డబ్బులేక పై చదువులను ఆపేసే విద్యార్థులకు చేయూత అందించడమే వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజ్ రీయంబర్స్ మెంట్ పథకం ముఖ్య ఉద్దేశ్యం.

ఇంజనీరింగ్, వైద్య, మేనేజ్ మెంట్ పొఫెషనల్ కోర్సులు అభ్యసించే పేద విద్యార్థుల చదువులకయ్యే పూర్తి ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందంటూ భరోసా ఇచ్చారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. 11లక్షల బలహీన వర్గాల కుటుంబాలు, 5లక్షల ఎస్సీ కుటుంబాలు, 1.8లక్షల గిరిజన కుటుంబాలు, 7.5 లక్షల మైనారిటీ కుటుంబాలు ఫీజ్ రీయంబర్స్ మెంట్ ద్వారా లబ్ది పొందాయి. ఒక్క 2009-10 ఆర్థిక సంవత్సరంలోనే 2,500 కోట్ల రూపాయిలను ఈ ఫథకం కోసం చెల్లించింది నాటి వైయస్సార్ ప్రభుత్వం.

ఈ విప్లవాత్మకమైన పథకం లక్షలాది మంది నిరుపేద విద్యార్థుల పెద్ద చదువుల కలలు సాకారం చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో లక్షల మంది ఫీజ్ రీయంబర్స్ మెంట్ పథకం ప్రయోజనాన్ని పొంది డాక్టర్లుగా, ఇంజనీర్లుగా స్థిరపడ్డారు. ఉన్నత విద్యావంతుడైన నాయకుడు పాలకుడైతే చదువుకు ఇచ్చే ప్రాధాన్యం ఎలా ఉంటుందో వైఎస్ పాలన నిరూపించింది.

Back to Top