తిరుపతి: ప్రజా సంకల్పయాత్రను దిగ్విజయంగా పూర్తిచేసుకున్న వైయస్ జగన్‌మోహన్ రెడ్డి రేణిగుంట రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు.జగన్ రాకతో రేణిగుంట రైల్వేస్టేషన్ పరిసరాలు జనంతో కిక్కిరిసిపోయింది. ఆశేష ప్రజానీకం ఘన స్వాగతం పలికారు.జై జగన్ అంటూ అభిమానుల నినాదాలతో మారుమోగింది. అక్కడ నుంచి తిరుపతికి పయనమయ్యారు. అటునుంచి పద్మావతి గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు.మధ్యాహ్నం తర్వాత అలిపిరి నుంచి నేరుగా కాలినడక తిరుమలకు చేరుకుంటారు.రాత్రి ఏడుగంటలకు సర్వదర్శనం క్యూలైన్లలో స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం శారద పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి ఆశీస్సులు పొందుతారు.రాత్రికి తిరుమలలో బస చేయనున్నారు.రేపు ఉదయం ఇడుపులపాయకు వెళ్లనున్నారు.