అవినీతిని అంతం చేస్తే తప్పు ఎలా అవుతుంది

 బాబు స్కిల్ స్కామ్ పై జిల్లా పరిషత్ చైర్మన్ చిన్న శ్రీను ఫైర్  

విజయనగరం జిల్లా: అవినీతిని అంతం చేస్తే తప్పు ఎలా అవుతుందని జిల్లా పరిషత్ చైర్మన్ చిన్న శ్రీను ప్ర‌శ్నించారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కుంభకోణంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంపై జిల్లా పరిషత్ చైర్మన్ చిన్న శ్రీను  మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ కుంభకోణానికి రూపకర్త, నిర్మాత, దర్శకత్వం అన్నీ చంద్రబాబేనని ఆరోపించారు. ఈ కేసులో చంద్రబాబుకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలు ఉన్నందునే చంద్ర బాబును అరెస్ట్ చేశారని చిన్న శ్రీను స్పష్టం చేశారు. 
ఏడాదిన్నర కిందట ఈ కేసు దర్యాప్తు మొదలైందని, తీగ లాగితే డొంక కదిలిందని అన్నారు. చేసిన నేరానికి సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి, రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా చంద్రబాబు కుమారుడు, దత్తపుత్రుడు వ్యహరించారని చిన్న శ్రీను విమర్శించారు. 

చంద్రబాబును రిమాండ్ కు పంపడం అనేది పెద్ద విషయం అని మేం భావించడం లేదని తెలిపారు.దర్యాప్తు ప్రక్రియలో అదొక భాగం. ఇందులో ఆరోపణలు రుజువు చేయాల్సి ఉందని, ఆధారాలు బలంగా ఉన్నాయి కాబట్టి నేరారోపణ రుజువవుతుందని అన్నారు. అరెస్ట్ సమయంలో ఏదో జరగబోతోందని టీడీపీ వాళ్లు డ్రామాలు చేశారని. రూ.370 కోట్ల ప్రభుత్వ సొమ్మును నేరుగా షెల్ కంపెనీలకు పంపించారని. ఆ సొమ్ము అక్కడ్నించి మళ్లీ చంద్రబాబు వద్దకు చేరిందని అందుకే స్కిల్ స్కామ్ లో చంద్రబాబు ప్రధాన ముద్దాయిగా పరిగణించాలని కోరారు.

స్కిల్ డెవలప్ మెంట్ సంస్థను చంద్రబాబు పూర్తిగా తన కిందనే పెట్టుకున్నాడని. సీఎస్, ఆర్థిక కార్యదర్శి తదితర అధికారులు కూడా సీఎం చెబితేనే చేశామని స్పష్టంగా చెప్పారు. ఇంత భారీ కుంభకోణం ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎప్పుడూ జరగలేదని చంద్రబాబు మొదటి వ్యక్తి అని తీవ్రస్థాయిలో చిన్న శ్రీను మండిపడ్డారు. 

ఇదంతా ఒకెత్తయితే సొంత కొడుకు కంటే దత్తకొడుకు వీరంగం ఎక్కువైపోయిందని పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు. తన ఇంట్లో పడుకున్నట్టు జగ్గయ్యపేట రోడ్డుపై కాలుమీద కాలేసుకుని విలాసంగా పడుకున్నాడని తెలిపారు. పవన్ ఒక పార్టీ అధ్యక్షుడుగా ఉండి కనీస విలువలు లేని వ్యక్తిలా ప్రవర్తించారని పవన్ ఉద్దేశం ఏంటో జనసేన కార్యకర్తలు అర్ధం చేసుకోవాలని కోరారు. 

ప్యాకేజి కోసం పార్టీ విధానాలను సైతం తాకట్టు పెట్టేసే వాడు పవన్ అని అన్నారు. ఈనాడు పత్రిక చూస్తే రామోజీరావు ఏదేదో రాసేశాడు. తాలిబన్లు అంటాడు, చెడ్డీ గ్యాంగ్ అంటాడు. ఈనాడు భాషలో ఉన్న బూతులన్నీ రాసేశారు. చంద్రబాబునే టచ్ చేస్తారా అని రాశారు. టచ్ చేస్తే చంద్రబాబునే చేయాలి. ఎందుకుంటే 45 ఏళ్లుగా ఆయన స్కాంలు చేస్తునే మీ లాంటి వారికి దన్నుగా ఉన్నాడని అన్నారు. ఎప్పుడైనా 10 అడుగులన్నా సక్రమంగా వేశారా? వ్యవస్థలను మేనేజ్ చేయడం, కోర్టుల్లో స్టేలు తెచ్చుకోవడం ద్వారా ఇన్నాళ్లుగా కొనసాగుతున్నాడని ఇప్పుడు ఆయన దొంగ బయట పడిందని అన్నారు. 

పెద్దాయన, మాజీ ముఖ్యమంత్రి కావడంతో హెలికాప్టర్ ఏర్పాటు చేశారు కానీ పబ్లిసిటీ కోసం ఉహూ అన్నాడు. బాబును విచారించిన డీఐజీ కూడా మామూలుగానే వ్యవహరించారని తెలిపారు. అవతలున్నది మాజీ సీఎం కావడంతో ఎందుకులే అనుకుని ఉండొచ్చు. కానీ ఆయన కొడుకు ఓ సీఐని మాట్లాడింది మామూలు బూతులా? మాజీ సీఎం కొడుకు అని గౌరవిస్తే, వాళ్ల పాలేర్లు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. 

ఎన్ని సమస్యలు వచ్చినా వైయ‌స్ జగన్ ధైర్యంగా నిలబడ్డారు. జగన్ కు ఇతరులకు చాలా తేడా ఉందని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వైయ‌స్ జగన్ ని ఎన్నో రకాలుగా మాటలు అంటున్నారని నీది ఒక పుట్టుక అనే మాట అని చంద్రబాబు అన్నారు అయినా సరే జగనన్న సంయమనం పాటిస్తూ ముందుకు సాగిపోతున్నారని తెలిపారు. లోకేష్ ఏకంగా కడ్రాయర్లుతో తిప్పిస్తా అని మాట్లాడినా సరే మౌనం వహించామని, రాజకీయాల్లో కడ్రాయర్లుతో తిప్పించడం అంటే మీ నాన్న చంద్రబాబు నంద్యాల నుండి విజయవాడ వరకు వచ్చిన తీరుని ఏమంటారు. దీన్ని కడ్రాయర్లు తో తిప్పడం అంటే అని తీవ్రస్థాయిలో స్పందించారు. 
పేదల డబ్బు, ప్రజల డబ్బు, యువతకు ఉపాది కల్పించాల్సిన డబ్బును అప్పనంగా దొంగ కంపెనీల పేరుతో దోచేసిన చంద్రబాబు కానీ ఆ పార్టీ నాయకులు కానీ ప్రజల ముందు మాట్లాడటానికి అర్హత కోల్పోయారని అన్నారు. అచ్చెన్నాయుడు పీక కోసుకుంటా అన్నావు ఇప్పుడు ఏమి సమాధానం చెబుతావు అని ప్రశ్నించారు.  రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని స్వయంగా పోన్ చేసి రెచ్చ గొట్టి దొరికి పోయిన నీకు రాజకీయాల్లో కొనసాగే అర్హత లేదని అన్నారు.

వ్యవస్థాలను మ్యానేజ్ చేస్తూ ఇన్నాల్లు గడిపేశావు కా‌నీ ఇప్పుడు అలా లేదు బాబు  తప్పు చేశారు కాబట్డే శిక్ష అనుభవించాల్సిందే అని జిల్లా పరిషత్ చైర్మన్ చిన్న శ్రీను తేల్చి చెప్పారు.

పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయని వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి జైలుకి వెళ్లారు కాబట్టే మిగతా వారిని జైలుకు పంపిస్తున్నారు అన్న వ్యాఖ్యలు చూస్తుంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా వ్యవస్థలను కించపరిచే విధంగా ఉన్నాయని ఇలాంటి వ్యాఖ్యలు ప్రజలు ఎవరు హర్షించరని తెలిపారు.

చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇవ్వడం అది మీ విధానం అని దానిని ఎవరు ప్రశ్నించారని కానీ కోర్టు ముద్దాయిగా చేసిన చంద్రబాబుకు మద్దతు పలకడం ద్వారా అవినీతిపరులకు అండగా నిలుస్తారా.. లేక అవినీతి కార్యక్రమానికి పాల్పడడమే మా విధానం అని మీరు ప్రజలకు చెప్పగలరా అని చిన్న శ్రీను ప్రశ్నించారు.

తాజా వీడియోలు

Back to Top