వైయస్‌ఆర్‌సీపీ ప్రభంజనం ఖాయం

ఓటమి చంద్రబాబు కళ్లముందు కనబడుతోంది

తప్పులను కప్పిపుచ్చుకోవడానికే ఈసీపై నెపం

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి  సజ్జల రామకృష్ణారెడ్డి

హైదరాబాద్‌:చంద్రబాబుకు ఓటమి తన కళ్లముందు కనబడుతుందని..దానిని కప్పిపుచ్చుకోడానికి ఈసీ మీద నెపం వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.ఆయన హైదరాబాద్‌లోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఐదేళ్లుగా ప్రజలను మభ్యపెడుతూ వచ్చిన చంద్రబాబు.. ఓడిపోతామని తెలిసిన.. నేడు కనీసం పార్టీనైనా నిలబెట్టుకోవాలని పార్టీకి చెందినవారిని మభ్యపెడుతున్నారన్నారు.ఎన్నికల తర్వాత చంద్రబాబు ఏం ఆశిస్తున్నారని ప్రశ్నించారు. పోలింగ్‌ తర్వాత కూడా చంద్రబాబు.. పథకం ప్రకారం సమీక్షలు పేరిట జరుపుతున్న కార్యక్రమాలు,ప్రకటలను చూస్తూంటే ప్రజలకు అనేక సందేహాలు  కలుగుతున్నాయన్నారు.

తెలుగుదేశం పార్టీకి చెందిన వారికి కూడా అనేక అనుమానాలు వస్తున్నాయన్నారు.రాబోయే ఫలితాలు కళ్లముందు కనబడుతున్నాయని, తన తప్పేమిలేదు..నా పాలన తప్పులేదు..కేవలం ఈవీఎంలు మెషిన్ల ద్వారా ఈ ఎన్నికలు ఘోరంగా తయారయ్యాయని నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఎలక్షన్‌ కమిషన్‌ వ్యవస్థ  నియంతృత్వ పోకడ వలనే ఈ ఫలితాలు వచ్చాయని  చెప్పడానికి చంద్రబాబు  గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేస్తున్నారని మండిపడ్డారు. ఈవీఎంలపై డౌటు ఉన్న కొన్ని పార్టీలు గతంలో కూడా ఈసీని కలిశాయని, ఈసీ కూడా సందేహాలకు వివరణ ఇచ్చిందన్నారు. తాజాగా సుప్రీంకోర్టు కూడా తీర్పునిచ్చిందని, ఆ తీర్పులో మీకు అనుమానాలు ఉంటే ఐదు ఈవిఎం మిషన్లను ర్యాండమ్‌గా కౌంటింగ్‌ చేయాలని చెప్పిందన్నారు.

ఎలక్షన్‌ కమిషన్‌ తరపున వకల్తా పుచ్చుకోవలసిన అవసరం లేదన్నారు. ఈసీని తప్పుబట్టాల్సిన అవసరం లేదన్నారు.ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేవి ముఖ్య ప్రక్రియ అని,మన ఆలోచనలు,సిద్ధాంతాలు ప్రకారం ఈవిఎంలు పనికిరావని అనుకుంటే..బ్యాలెట్‌ పేపర్‌పైనే ఎన్నికలు జరగాలని పోరాడవచ్చన్నారు. పోలింగ్‌ పూర్తి అయిన తర్వాత ఇప్పుడు ఈవీంలపై అనుమానాలు వ్యక్తం చేయడం సరికాదన్నారు.ఈవీఎంలలో పొరపాట్లు లేకుండా వీవీ ప్యాట్లు తీసుకొచ్చారన్నారు.ఒక పక్క 150 సీట్లు మావేనంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారన్నారు.రాబోయే ఎన్నికల ఫలితాల్లో వైయస్‌ఆర్‌సీపీ గెలవబోతుందని చంద్రబాబుకు కళ్ల ముందు కనబడుతుందన్నారు.వచ్చే ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ ప్రభంజనం ఖాయమన్నారు.క్యాడర్‌ను కాపాడుకోవడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. టీడీపీ ఓడిపోయిన తర్వాత..ఈవీఎంలను ట్యాపర్‌ చేశారని ప్రచారం చేసి తెలుగుదేశం నేతలకు,కార్యకర్తలకు నచ్చచెప్పుకోవడానికి చంద్రబాబు నాటకాలు మొదలుపెట్టారన్నారు.ఇంకా ఎవరిని నమ్మించడానికి చంద్రబాబు హడావుడి చేస్తున్నారని ప్రశ్నించారు.
 

తాజా వీడియోలు

Back to Top