ఎమ్మెల్యేల్లో ఎవరికీ అసంతృప్తి లేదు

 వైవీ సుబ్బారెడ్డి 
 

అమ‌రావ‌తి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు, ఎమ్మెల్యేల్లో ఎవరికీ అసంతృప్తి లేదని పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం నివాసంలో వైయ‌స్ జగన్ ని ఈ రోజు ఆయన కలిశారు. అనంతరం, మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి పదవులు దక్కని తమ ఎమ్మెల్యేల్లో ఎటువంటి అసంతృప్తి లేదని చెప్పారు. త్వరలో నామినేటెడ్ పదవులు భర్తీ చేసేందుకు సీఎం చర్యలు చేపట్టనున్నట్టు చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక ఈ పదవులను భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయని, ముఖ్యమైన నామినేటెడ్ పదవులను ఎమ్మెల్యేలకు దక్కక వచ్చని అభిప్రాయపడ్డారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top