భక్తుల మృతి బాధాకరం 

టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దిగ్భ్రాంతి 

తాడేప‌ల్లి:  తిరుపతిలో టోకెన్ల జారీ కేంద్రం వద్ద తొక్కిసలాటలో భక్తులు మరణించడం ఆవేదన కలిగిస్తోంద‌ని టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు.  గాయపడ్డ వారికి తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలి.  వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల కోసం వచ్చిన భక్తులు ఇలా ప్రాణాలు కోల్పోవడం ఐదేళ్ల వైయ‌స్ఆర్‌సీపీ పాలనలో ఎప్పుడూ జరగలేదు. ఈ ఘటన అత్యంత విచారకరం. అక్కడ సాధారణ పరిస్థితులు వచ్చేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలి. మా హయాంలో వారం ముందే టోకెన్లు జారీ చేసేవాళ్లం. వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై 10 రోజుల నుంచి నిద్రాహారాలు మాని శ్రమపడే వాళ్లమ‌ని చెప్పారు.  తొక్కిస‌లాట ఘ‌ట‌న‌కు ప్ర‌భుత్వ‌మే బాధ్య‌త వ‌హించాల‌ని ఆయ‌న డిమాండు చేశారు.

Back to Top