ప్ర‌తి గ‌డ‌ప‌కు వెళ్లి మ‌న ప్ర‌భుత్వ విజ‌యాల‌ను వివ‌రిద్దాం

 వైయ‌స్ఆర్‌సీపీ రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్ వైవీ సుబ్బారెడ్డి

వై ఏపీ నీడ్స్ జ‌గ‌న్ కార్యక్ర‌మంపై పార్టీ శ్రేణుల‌కు దిశానిర్దేశం

విజ‌య‌న‌గ‌రం:  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈ 52 నెల‌ల పాల‌న‌లో సాధించిన విజ‌యాల‌ను ప్ర‌తి గ‌డప‌కు వెళ్లి వివ‌రించాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్ వైవీ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం గ‌జ‌ప‌తిన‌గ‌రం నియోజ‌క‌వ‌ర్గంలోని గొట్లాం సత్య లేఔట్ లో ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య అధ్యక్షతన జరిగిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్ వై వి సుబ్బారెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ , విజయనగరం జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా వై ఏపీ నీడ్స్ వైయ‌స్ జ‌గ‌న్ అనే కార్య‌క్ర‌మంపై పార్టీ శ్రేణుల‌కు దిశానిర్దేశం చేశారు.  
వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమాన్ని వచ్చే నెలలో ప్రారంభిస్తున్నాం. ఈ క్యాంపెయిన్ ద్వారా రెండు లక్ష్యాలను వైయ‌స్ఆర్‌ సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ నిర్దేశించారు. మొదటిది సీఎం వైయ‌స్ జగన్ ప్రతి బహిరంగ సభలో చెబుతున్న వై నాట్ 175 అన్న నినాదాన్ని నిజం చేసేందుకు పార్టీ శ్రేణులు పని చేసేలా సన్నద్ధం చేయడం.

రెండోది ఆంధ్రప్రదేశ్‌కు మళ్లీ ముఖ్యమంత్రిగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి ఎందుకు కావాలనే నినాదంతో ప్రతి గడపకు వెళ్లి సాధించిన విజయాలను వివరించాలని నిర్ణయించారు. గత 52 నెలల పాలనలో వైయ‌స్ఆర్‌సీపీ చేసిన మంచిని ప్రజలకు రాత పూర్వకంగా వివరించాల‌న్నారు. ఈ రెండు లక్ష్యాలతో వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని వైయ‌స్ఆర్‌సీపీ నిర్వహిస్తుంద‌న్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ అన్ని స్థాయిల నాయకుల్ని ఒక్క తాటిపైకి తెచ్చిన 175/175 లక్ష్యం కోసం పనిచేయాలనే ఉద్దేశంతో  వైయ‌స్ఆర్‌సీపీ ఈ క్యాంపెయిన్ కు రూపకల్పన చేసింద‌ని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 

సమావేశంలో శాసనమండలి సభ్యులు లెల్ల అప్పిరెడ్డి , డాక్ట‌ర్‌ పెనుమత్స సురేష్ బాబు, ఇందుకూరి రఘురాజు, జెడ్పిటిసిలు, ఎంపీపీలు, ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గృహసారథులు, తదితరులు పాల్గొన్నారు.

Back to Top