సీఎం వైయ‌స్‌ జగన్ సంక్షేమ అభివృద్ధి పాలన మరలా తీసుకురావాలి

వైయ‌స్ఆర్‌సీపీ రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్‌, రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి 

విశాఖ‌: సీఎం వైఎస్‌ జగన్ సంక్షేమ అభివృద్ధి పాలన మరలా తీసుకురావాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్‌, రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి  పిలుపునిచ్చారు. ఆదివారం విశాఖ‌లో ఆయ‌న మాట్లాడుతూ..పొత్తులతో మళ్లీ ఎన్నికలకు వస్తున్న చంద్రబాబు గతంలో 600 హామీలు అని చెప్పి మోసం చేశారని మండిప‌డ్డారు. ఇప్పుడు ఆరు హామీలు అని మభ్యపెట్టడానికి మళ్లీ వచ్చారని దుయ్య‌బ‌ట్టారు. ఎన్ని పొత్తులతో వచ్చినా చంద్రబాబుకు బుద్ధి చెప్పి పంపాల‌న్నారు.

Back to Top