విశాఖపట్నం: వైయస్ఆర్ 75వ జయంతిని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించామని వైయస్ఆర్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఓటమి తరువాత ఎవ్వరూ డీలా పడాల్సిన అవసరం లేదు.. గెలుపు ఓటములు సహజం... కారణం ఏదైనా కానీ ప్రజా తీర్పుగానే భావించాలి. పార్టీ నాయకులంతా ప్రజలకు అండగా ఉండాలని వైవీ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. ఆస్ట్రేలియాలో ఉండే ప్రవాసాంధ్రులతో కూడా మాట్లాడి వైయస్ఆర్ జయంతి వేడుకల కోసం సందేశం ఇచ్చాను. వైయస్ఆర్‌సీపీ తరఫున గెలిచిన జడ్పీటీసీ, ఎంపీటీసీ పార్టీకి అండగా ఉంటారు. వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తారు. టీడీపీ ప్రలోభాలకు ఎవరూ లొంగిపోవద్దని సూచించాను. మా పార్టీ జడ్పీటీసీ, ఎంపీటీసీలపై మాకు పూర్తి నమ్మకం ఉందని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.