ప‌వ‌న్‌-చంద్ర‌బాబుది లోపాయికారి ఒప్పందం

వైయ‌స్ఆర్‌సీపీ యువ‌జ‌న విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడు  బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి

విజ‌య‌వాడ‌:  చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ యువ‌జ‌న విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడు  బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాజ‌కీయాలు వేరు సినిమా వేర‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలుసుకోలేక పోతున్నార‌ని ఎద్దేవా చేశారు. వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లకు దిగినంత మాత్రాన త‌మ‌కు ఉన్న గౌర‌వం ఏమీ త‌గ్గ‌ద‌న్నారు. ఆ విష‌యం గుర్తిస్తే మంచిద‌ని సూచించారు. ఆరోగ్య‌క‌ర‌మైన విమ‌ర్శ‌ల‌ను, ఆరోప‌ణ‌ల‌ను స్వాగ‌తిస్తామ‌ని కానీ పూర్తిగా త‌మ నాయ‌కుడు వైయ‌స్ జ‌గ‌న్ రెడ్డిని విమ‌ర్శిస్తే ఊరుకునే ప్ర‌స‌క్తి లేద‌ని హెచ్చ‌రించారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ నైజం ఎలా ఉందంటే రంగం సినిమాలోని విల‌న్ క్యారెక్ట‌ర్ ను త‌ల‌పింప చేస్తోందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ , నారా చంద్ర‌బాబు నాయుడిది లోపాయికారి ఒప్పందం చేసుకున్నార‌ని ఆరోపించారు. అందులో భాగంగానే నాట‌కాలు ఆడుతున్నార‌ని, ప్ర‌జ‌ల‌ను మ‌భ్య పెట్టేందుకు య‌త్నిస్తున్నారంటూ మండిప‌డ్డారు బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి. త‌మ పార్టీ అధినేత వైయ‌స్‌ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గ‌నుక తెలంగాణ‌లో వేలు పెడితే అక్క‌డి రాజ‌కీయాలు త‌ల‌కిందులు కావ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు.

ఇక‌నైనా ప్ర‌జ‌ల‌కు సేవ చేయడం నేర్చుకోవాల‌ని కానీ నిరాధార‌మైన అవాస్త‌వాల‌ను ప్ర‌చారం చేయాల‌ని చూస్తే ఊరుకోమ‌న్నారు. రాబోయే ఎన్నిక‌ల్లో ఎవ‌రి స‌త్తా ఏమిటో తేలుతుంద‌న్నారు. రాష్ట్రంలోని 175 స్థానాల‌లో తామే గెలుస్తామ‌ని ఆయ‌న ఛాలెంజ్ చేశారు.  'పవన్ కళ్యాణ్‌కు 175 నియోజకవర్గాల పేర్లు తెలుసా.. కనీసం కొత్తగా ఏర్పడినా జిల్లాల పేర్లు అయినా తెలుసా. వైయ‌స్‌ జగన్ నమ్ముకొని వేలాది మంది మంచి మంచి స్థానాల్లో కూర్చొని ఉన్నారు. పవన్‌ను నమ్ముకొని రాజకీయం చేస్తే.. రోడ్డున పడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అప్పుల పాలయ్యారు. పవన్ కోసం పనిచేసే కార్యకర్తలు.. ఎన్నికల సమయంలో.. చంద్రబాబు కోసం పనిచేయాల్సి వస్తోంది' అని సిద్ధార్థ రెడ్డి వ్యాఖ్యానించారు.

'హైపర్ ఆది వంటివారు ఏమైనా మాట్లాడొచ్చు. ఎవరికైనా మద్దతు తెలపొచ్చు. ఎవ్వరినీ తప్పుపట్టడం లేదు. మేము వ్యతిరేకించేది వారి నాయకుడినే. పవన్ కళ్యాణ్‌ది రంగం సినిమాలో లాగా విలన్ టైపు రాజకీయం. పొద్దుల లేచి ఉద్యమం, పోరాటం అని చెప్పే పవన్.. రాత్రి వెళ్లి మళ్లీ చంద్రబాబుతో కలిసి రాజకీయం చేస్తారు. లోపాయికారి ఒప్పందం ఉంది కాబట్టే.. చంద్రబాబు, పవన్ కలిసి రాజకీయం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు.

 

Back to Top