రక్తదాన రిజిస్ట్రేషన్లలో వైయ‌స్ఆర్‌సీపీ ప్రపంచ రికార్డ్‌

తాడేపల్లి: రక్తదాన రిజిస్ట్రేషన్లలో వైయ‌స్ఆర్‌సీపీ ప్రపంచ రికార్డ్‌సాధించింది. లక్షా 30 వేల మంది రిజిస్ట్రేషన్లతో వరల్డ్‌ రికార్డ్‌ సృష్టించింది. 72 వేల నిల్వలతో దక్షిణాఫ్రికా పేరిట గతంలో రికార్డు ఉండగా, దక్షిణాఫ్రికా రికార్డును వైయ‌స్ఆర్‌సీపీ బద్దలుకొట్టింది.

సీఎం వైయ‌స్‌ జగన్‌ పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలలోనూ రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ రిజిస్ట్రేషన్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన చల్లా మధుసూదన్‌రెడ్డి, సిబ్బందిని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అభినందించారు.

Back to Top