విశాఖ: చంద్రబాబుపై ఈడీ, ఐటీ, సీఐడి మోగిస్తున్న అవినీతి మోతకు సమాధానం చెప్పు అంటూ వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి నారా బ్రహ్మణిని నిలదీశారు. తప్పుచేసి సంఘీభావం కోరడం సిగ్గుచేటుః – ప్రజాధనం దోపిడీ చేసి ఆధారాలతో అడ్డంగా దొరికిన దొంగ చంద్రబాబు అని అందరికీ తెలిసిపోయింది. – అధికారాన్ని అడ్డంపెట్టుకుని అనేక కుంభకోణాలకు పాల్పడిన చంద్రబాబు, లోకేశ్‌లు తప్పులు మీద తప్పులు చేస్తూ కూడా బుకాయించడం ఎంతవరకు సబబు..? అవాస్తవాల ప్రచారంతో వారు చట్టం నుంచి తప్పించుకోవాలని చూడటం సిగ్గుచేటు. – అవినీతిపరులకు, దొంగలకు ప్రజలు చప్పట్లు కొట్టి సంఘీభావం తెలియజేయమని నారా బ్రాహ్మణి ట్వీట్ చేయడం హాస్యాస్పదంగా ఉంది. – స్కిల్‌డెవలప్‌మెంట్, ఫైబర్‌గ్రిడ్, అమరావతి అసైన్డ్‌ల్యాండ్స్, ఇన్నర్‌రింగ్ రోడ్ అలైన్‌మెంట్ కుంభకోణాల్లో చంద్రబాబు, లోకేశ్ పాత్ర ఉందని సీఐడీ, న్యాయస్థానాలు ప్రాధమిక ఆదారాలు గుర్తించినప్పుడు నేరస్తులు నిరసనలు, సంఘీభావాలు కోరుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నాను. 2019 ఎన్నికల్లోనే మీకు మోతమోగిందిః – చంద్రబాబు అరెస్టుతో జైల్లో ఉంటే.. లోకేశ్ మాత్రం సీఐడీకి కూడా దొరక్కుండా ఢిల్లీలో దాక్కున్నాడు. – నారా బ్రాహ్మణి మాత్రం మాకు సంఘీభావంగా పళ్లాలు మోగించండి.. చప్పట్లతో మోత మోగించండి అంటూ వేడుకుంటుంది. నిజానికి, ఆమె మామ చంద్రబాబు అవినీతి అరాచకాలను ప్రజలు భరించలేకనే 2019 ఎన్నికల్లో మోతమోగించి 23 సీట్లకే పరిమితం చేశారనేది గుర్తుకు తెచ్చుకోవాలి. – టీడీపీ అవినీతి అరాచక పాలన తెలిసిన ప్రజలెవరూ ఇప్పుడు కొత్తగా మోగించేదేమీలేదు. ఎందుకంటే, గతంలో మాదిరిగా చంద్రబాబు మాయ మాటల్ని నమ్మే అమాయకంగా ప్రజలు లేరనే సంగతి బ్రాహ్మణి గుర్తెరగాలి. సీబీఐ ఎంక్వైరీ కోరే దమ్ముందా..?ః – చంద్రబాబు అండ్ కో ఎలాంటి అవినీతికి పాల్పడకపోతే.. స్కిల్‌డెవలప్‌మెంట్, ఫైబర్‌గ్రిడ్, అమరావతి అసైన్డ్‌ల్యాండ్స్, ఇన్నర్‌రింగ్ రోడ్ అలైన్‌మెంట్ స్కామ్‌లపై సీబీఐ ఎంక్వైరీ కావాలని అడగొచ్చు కదా..? – దమ్ముంటే చంద్రబాబు కుటుంబంతో పాటు టీడీపీ నేతలంతా చప్పట్లు మోగించి, పళ్లాలు కొట్టిమరీ మాపై వచ్చిన అవినీతి ఆరోపణలపై .. కుంభకోణాల్ని నిగ్గుతేల్చేందుకు సీబీఐ ఎంక్వైరీ కావాలని కోరాలి. కానీ, మీరు అలా కోరడం లేదు. అంటే, ఈ కుంభకోణాల్లో ఖచ్చితంగా చంద్రబాబు, లోకేశ్ పాత్ర ఉందని.. రూ.కోట్లు కొల్లగొట్టిందని నిజమేనని మీరే ఒప్పుకున్నట్లు ప్రజలకు అర్ధమైంది. చంద్రబాబును మించిన నియంతే లేడుః తన మామను అరెస్టు చేశారంటూ బ్రాహ్మణి బాధపడటంలో అర్ధమే లేదు. ఎందుకంటే, చంద్రబాబును మించిన నియంత ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇప్పటివరకు ఎవరూ లేరనే సంగతి ఆమె తెలుసుకోవాలి. – 14 ఏళ్లపాటు అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వ తప్పులు ఎత్తిచూపిన వారందరిపై చంద్రబాబు ఒక నియంతలా వ్యవహరించాడు. ప్రత్యేకహోదా గురించి నోరెత్తి ప్రశ్నించిన వారినందర్నీ జైళ్లల్లో పెట్టి హింసించాడు. ఉద్యోగాలివ్వాలని నిరుద్యోగులు రోడ్డెక్కితే వారికి లాఠీదెబ్బల్ని రుచిచూపించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. – నియంత పరిపాలనను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పరిచయం చేసిన వ్యక్తి చంద్రబాబు కాగా, ఆయన కోడలిగా బ్రాహ్మణి ఇప్పుడు నియంత పాలన సాగుతుందనడం హాస్యాస్పదంగా ఉంది. – చంద్రబాబు అరెస్టుతో సానుభూతి వస్తుందనే భువనేశ్వరి, బ్రాహ్మణి ప్రయత్నాలు ప్రజల్లో అభాసుపాలవుతున్నాయి. వారి మాటల్ని నమ్మేందుకు ప్రజలెవరూ సిద్ధంగా లేరు. – ఇప్పటికైనా చంద్రబాబు, లోకేశ్‌లు నిజాయితీగా వ్యవహరించి తమ తప్పులు తెలుసుకుని న్యాయస్థానాల ఎదుట ఒప్పుకుంటే మంచిదని హితవు పలుకుతున్నాను.