జూన్ 4న వెన్నుపోటు దినం విజయవంతం చేద్దాం

వైయ‌స్ఆర్‌సీపీ తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ భూమన అభినయ్ రెడ్డి 

తిరుప‌తి:  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని తిరుపతిలో పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని వైయ‌స్ఆర్‌సీపీ తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ భూమన అభినయ్ రెడ్డి పిలుపునిచ్చారు.  మంగ‌ళ‌వారం తిరుపతి నియోజకవర్గం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో సమన్వయ సమావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి ముఖ్య అతిథిగా  తిరుపతి, చిత్తూరు జిల్లాలు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, భూమన అభినయ్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, కార్పొరేటర్లు, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజ‌ర‌య్యారు, ఈ సంద‌ర్భంగా భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ..`జూన్ 4 వెన్నుపోటు దినం గా  పార్టీ ప్రకటించిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలి. కూటమి నేతలు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్నారు. అమలు చేయకపోవడానికి కారణం వైయ‌స్.జగన్ మోహన్ రెడ్డి అంటూ తప్పుడు విష ప్రచారం చేస్తున్నారు. వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న‌లో డీబీటీ ద్వారా రూ. 2 లక్షల 50వేల కోట్లు పేద ప్రజల‌కు నేరుగా అందించారు. చంద్ర‌బాబు ఎన్నికల్లో అబద్ధపు ప్రచారం చేసి ప్రజల్ని మోసం చేశారు..ఇప్పుడు అదే చేస్తున్నారు. ఈరోజు తప్పుడు కేసులు, నిర్భంధం చేస్తున్నా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ భయపడేది లేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం  దమన కాండ కు వ్యతిరేకంగా వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ధైర్యంగా ఎదురోడ్డి పోరాటం చేస్తున్నారు. జూన్ 4 వ తేదీ వెన్నుపోటు దినం లో పెద్ద ఎత్తున పాల్గొనేందుకు సిద్ధం కావాలి. ఓడి పోవచ్చు గాక, ఒంగిపోయే పరిస్థితి ఎప్పటికీ రాదు. అధికారం రావచ్చు,పోవచ్చు..ప్రజలు పక్షాన పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. తిరుపతి నియోజకవర్గం అంటే రాష్ట్రంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. నమ్మకద్రోహం చేసేదానికంటే అంతకన్నా  మోసం  ఇంక ఏమి లేదు, వ్యక్తిత్వం చంపుకుని బ్రతకాల్సిన పని ఏది లేదు.  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి పోరాటం చేస్తున్నారు..మీ అందరికి సెల్యూట్ చేస్తున్నా` అంటూ భూమన కరుణాకరరెడ్డి ప్ర‌సంగించారు. పోరాడితే పోయేదేమీ లేదు..మన పార్టీ అధికారంలోకి రావ‌డం ఖాయమ‌ని ఉద్ఘాటించారు. 

Back to Top