కుట్రలతో ఇచ్చిన జీవో ని రద్దు చేయాలి 

వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం అనంత‌పురం జిల్లా అధ్య‌క్షుడు చంద్రశేఖర్ యాదవ్

అంబేద్కర్ విగ్రహం ముందు మోకాళ్ళ మీద కూర్చొని నిరసన

ప్రభుత్వ విద్యార్థులపై కక్షని వ్యక్తం చేయడంలో భాగమే జీవో

ప్రభుత్వ విద్యను నీరుగార్చడమే మంత్రి లోకేష్ లక్ష్యం!

పాఠశాలల్లోకి బయట వ్యక్తుల ప్రవేశాన్ని నిషేధించే జిఓ వెనక కుట్ర?

కూటమి ప్రభుత్వంలో విద్యార్థుల మీద ఎల్లో బుక్ రూల్స్ ని ఆపాలి

అనంతపురం:  రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లోకి విద్యార్థి సంఘాలు ప్రవేశించొద్దని కూటమి ప్రభుత్వం కుట్ర‌ల‌తో జారీ చేసిన చీక‌టి జీవోను వెంట‌నే ర‌ద్దు చేయాల‌ని  వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం అనంత‌పురం జిల్లా అధ్య‌క్షుడు చంద్రశేఖర్ యాదవ్ డిమాండ్ చేశారు. అనంతపురం నగరంలో జడ్పీ కార్యాలయం వద్ద గల అంబేద్కర్ విగ్రహం ఎదుట వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ప్రభుత్వం విడుదల చేసిన జీవో RC. No 30/67/2025 Dated (02-08-2025) ని రద్దు చేయాలని మోకాళ్ళ మీద కూర్చొని నిరసన వ్యక్తం చేశారు.ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం లేదని రెడ్‌బుక్‌ పాలన, ఎల్లో బుక్ ఎడ్యుకేషన్ పాలసీ నడుస్తుందన్నారు.  ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు బయటకి వస్తాయన్న భయంతోనే ప్రభుత్వ పాఠశాల్లోకి ఎవ్వరూ వెళ్ళకూడదనే జీవోని రిలీజ్ చేసిందని విమర్శించారు.  కూటమి ప్రభుత్వం అద్భుతంగా పరిపాలిస్తే విద్యార్థులని విద్యార్థి నాయకులు గానీ,  ప్రజా సంఘాల నాయకులు గాని కలవకూడదన్న జీవోని ఎందుకు తెచ్చారని ప్రశ్నించారు. ప్రభుత్వ విద్యను నీరుగార్చడమే మంత్రి నారా లోకేష్ లక్ష్యమని దుయ్యబట్టారు. రాష్ట్రములో జైలులో ఉన్న ఖైదీలను కలవడానికి వెసులుబాటు ఉన్నది గానీ చదువుకునే విద్యార్థులు కలవడానికి అవకాశం లేకుండా చేసిన ఘనత దేశ వ్యాప్తంగా ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కే దక్కుతుందని మండిపడ్డారు.  ఎల్లో బుక్ రూల్స్ తో విద్యా వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందన్నారు.తక్షణమే జీవో ని రద్దు చేయాలని గతంలో జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్  స్కూల్ కి వెళ్ళిన సందర్భాన్ని మరిచిపోయారని తెలిపారు. ప్రస్తుతం జీవో మీద మాట్లాడకుండా మౌన దీక్ష ఎందుకు చేస్తున్నారని విద్యార్థుల పక్షపాతిగా పవన్ కళ్యాణ్  ప్రశ్నించాలని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. 
      రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యావిధానం అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి కానీ కార్పొరేట్  విద్యాసంస్థల అభివృద్ధి లక్ష్యంగా మంత్రి నారా లోకేష్  పనిచేస్తున్నారని విమర్శించారు.  సంవత్సర కాలంలో విద్యావ్యవస్థ పూర్తిగా నాశనం అయిపోయిందన్నారు. నగర అధ్యక్షులు కైలాష్, జిల్లా ప్రధాన కార్యదర్శి నిశాంత్ రెడ్డి మాట్లాడుతూ వైయస్సార్ విద్యార్థి విభాగం నాయకులు హాస్టల్లో సందర్శన కార్యక్రమం చేపట్టినప్పుడు విద్యార్థుల సమస్యలు బయటకి వచ్చాయన్నారు.ఇంకా అనేక సమస్యలు బయటికి వస్తాయనే కూటమి ప్రభుత్వం భయపడి జీవోని రిలీజ్ చేసిందన్నారు.  విద్యార్థుల మీద ప్రేమ, గౌరవం చూపించిన సీఎం జగనన్న అని, ద్వేషం అసూయ చూపిస్తున్నది మంత్రి నారా లోకేష్ గారని  రెడ్బుక్ మీద పెట్టిన దృష్టి పిల్లల బుక్కులు మీద పెట్టలేదన్నారు.  తక్షణమే జీవోని రద్దు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  కార్యక్రమంలో వైయస్సార్ విద్యార్థి విభాగం  జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్, శింగనమల నియోజకవర్గ అధ్యక్షులు రేవంత్, నగర నాయకులు రాహుల్ రెడ్డి, ఆదిల్,అశోక్,నరేంద్రారెడ్డి,సిద్దిక్, రోహిత్,జిలాన్,సతీష్, నాగేంద్ర,గణ,రోహిత్,గణేష్ రెడ్డి, హాజీబ్, రషీక్,నిఖిల్,చిన్న,  షేక్ దాదు, సుభహన్, ఆఫ్రిద్, ఇమ్రాన్, షాహిద్, శివ, సాయి,రవి,పూజ విగ్నేష్,బాబా ఇమ్రాన్,సురేంద్ర, చరణ్ తదితరులు పాల్గొన్నారు.

Back to Top