రాష్ట్రం అరాచక ఆంధ్రప్రదేశ్ గా మారింది

మహిళలమీద అఘాయిత్యాలకు పాల్పడిన వారిని నెలరోజుల్లోగా శిక్షించాలి 

ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వైయ‌స్ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి 

నిందితులను శిక్షించకపోతే బాధితుల తరపున ఆందోళన చేస్తాం 

ప్రభుత్వాన్ని నిలదీస్తాం వరుదు కళ్యాణి స్పష్టీకరణ. 

అత్యాచారాలు.. హత్యలకు అడ్డాగా తయారైంది

ప్రజాస్వామ్యంలో ఉన్నామా?.. ఆటవిక రాజ్యంలో జీవిస్తున్నామా..?
 
130 రోజుల కూటమి పాలనలో మహిళలపై 130కి పైగా ఘటనలు 

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం సొంత జిల్లాల్లో అత్యాచారాలు జరిగినా స్పందన లేదు.

ఒక్క ఘటనలోనూ బాధితులకు ధైర్యం చెప్పని సీఎం.

ఈ అకృత్యాలు నీకు కనిపించం లేదా పవన్ కళ్యాణ్‌ 

నీ నియోజకవర్గంలో టీడీపీ నేత అత్యాచారం చేస్తే ఏం చేశావ్‌? 

రాష్ట్ర చరిత్రలో అత్యంత చేతగాని హోమ్ మంత్రి అనిత మాత్రమే

దాడుల్లో చనిపోయిన బాధిత మహిళల కుటుంబాలకు రూ. 20 లక్షల ఇవ్వాలి. 

విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని చెప్పి, ఇప్పుడు వేల కోట్ల రూపాయల భారం మోపుతున్నారు

ఉచిత గ్యాస్ సిలిండర్ల స్కీమ్ లో అరకోటి మంది వైట్ రేషన్ కార్డులకు మొండి 

కూటమి పాలన ఇలానే కొనసాగితే ప్రజా పోరాటాలకు దిగుతాం

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి హెచ్చరిక

విశాఖపట్నం : ఐదు నెలల కూటమి పాలనలో రాష్ట్రం ఆరాచక ఆంధ్రప్రదేశ్ గా మారిపోయిందని వైయ‌స్ఆర్‌సీపీ  రాష్ట్ర మహిళా విభాగ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ధ్వజమెత్తారు. చంద్రబాబు పాలనలో మహిళల మాన ప్రాణాలు గాల్లో దీపాలుగా మారిపోయాయని, ప్రజాస్వామద్య దేశంలో ఉన్నామా.. ఆటవిక రాజ్యంలో జీవిస్తున్నామా ఆనే అనుమానం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రభుత్వం చేతగానితనం కారణంగా రాష్ట్రం ఆత్యాచారాలు, హత్యలకు అడ్డాగా మారిపోయిందని మండిపడ్డారు. మహిళలమీద అఘాయిత్యాలకు పాల్పడిన వారిపై నెలరోజుల్లోగా విచారణ చేసి కఠినంగా శిక్షించాలి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బాధితుల తరపున వైయ‌స్ఆర్‌సీపీ  ఆందోళన చేస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

విశాఖలో తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యంపై ధ్వజమెత్తారు. గతంలో ఎన్న్డడూ లేని విధంగా  కూటమి పాలనలో 130 రోజుల్లో 130కి పైగా అత్యాచారాలు, దాడులు, హత్యలు, వేధింపులు వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని, వీటిలో  8 మంది మహిళల హత్యకు గురికాగా, మరో  5 మంది వేధింపులు తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న దుస్థితి ఉందన్నారు.

 ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు  నగరిలో మూడున్నరేళ్ల బాలికకు చాక్లెట్స్ ఆశ చూపి మద్యం, గంజాయి మత్తులో దుర్మార్గుడు అఘాయిత్యం చేసి హత్య చేసాడని, అయినా సరే    సీఎం స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నియోజకవర్గం సమీపంలోనే  కడియం మండలం బుర్రి లంకలో మహిళకు నోట్లో గుడ్డలు కుక్కి గ్యాంగ్ రేప్ చేసి చంపేసి కాలువలో పడేసినా నోరు మెదపడం లేదని, తాజాగా  తిరుపతి ప్రైవేటు లాడ్జిలో మైనర్ పై అత్యాచారం ఘటన జరిగినా సరైన రక్షణ చర్యలు లేవని ఆవేదన వ్యక్తం చేసారు. 

రాష్ట్రంలో ఎన్నో అత్యాచార, వేధింపులు, హత్యలు జరిగినా సరే  ఏ సంఘటనలోనైనా సరే   బాధిత కుటుంబానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు పరామర్శ చేసి  ధైర్యం చెప్పారా..? నిందితులపై కఠిన చర్యలు తీసుకున్నారా..? అని ప్రశ్నించారు.  శ్రీకృష్ణ దేవరాయుల పాలనలో రత్నాలు, రాశులు రోడ్డుపై పోగులు పోసి అమ్మితే.. బాబు పాలనలో మద్యంను రోడ్ల మీద వరదలా పారిస్తున్నారని ఆక్షేపించారు.  తొక్కి పెట్టి నార తీస్తానని డిప్యూటీ సీఎం పవన్ డైలాగులు చెబుతున్నాడని, మరి ఆయన నియోజకవర్గంలో    టీడీపీ నాయకుడు మద్యం తాగి మహిళలపై అత్యాచారాం చేస్తే తొక్కి పెట్టి నార తీసారా..?   ఎమ్మెల్యే పంతం నానాజీ ఎమ్మెల్యే అనుచరులు ఓ మహిళపై చేసిన వేధింపులు ఘటనలో  వారిని తొక్కిపెట్టి నారతీసారా..? ముచ్చుమర్రి ఘటనలో ఇప్పటికీ బాలిక మృతదేహాన్ని గుర్తించలేదని, కనీసం నిందితులను పట్టుకుని   తొక్కి పెట్టి నార తీయలేదేం.. అని  వరుదు కల్యాణీ ధ్వజమెత్తారు. ఎంతసేపు ప్రతిపక్ష పార్టీని  టార్గెట్ చేసి   డిప్యూటీ సీఎం హోదాలో ఉండి మాట్లాడటం సరికాదని హితవు పలికారు. 

రాష్ట్ర చరిత్రలో అత్యంత చేతగాని హోమ్ మంత్రి అనిత మాత్రమే అని వరుదు కల్యాణి ఘాటుగా వ్యాఖ్యనించారు. రాష్ట్రంలో మహిళలపై  వరుస ఘటనలు జరుగుతున్నా సరే ఏమాత్రం స్పందించకపోవడం, చర్యలు తీసుకోకపోవడం వల్లనే దుర్మార్గులు రెచ్చిపోతున్నారని ధ్వజమెత్తారు.   రెడ్ బుక్ లో మూడో అథ్యాయం ప్రారంభమవుతుందన్న లోకేశ్ వ్యాఖ్యాలపై వరుదు కల్యాణి స్పందిస్తూ, రెడ్ బుక్ పై పెడుతున్న శ్రద్ధ,  మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న దుర్మార్గులపై పెడితే బాగుంటుందని హితవు పలికారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడుల్లో  చనిపోయిన వారికి ప్రభుత్వం  పరిహారం రూ. 20 లక్షలు  ఇవ్వాలని డిమాండ్ చేసారు. 

ఎన్నికలకు ముందు కూటమి  మ్యానిఫెస్టోలో వైట్ రేషన్ కార్డులున్న వారందరికీ ఉచిత గ్యాస్ అని ప్రచారం చేసారని, తీరా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత  కోటి 47 లక్షల వైట్ రేషన్  కార్డులుంటే, అర కోటి మందికి మొండి చేయి  చూపారని విమర్శించారు. ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితమని చెప్పి ఒక సిలిండర్ ఇచ్చే పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు.  అధికారంలోకి వస్తే   విద్యుత్ చార్జీలు పెంచబోమని,  తగ్గిస్తామని చెప్పి  వేల కోట్ల రూపాయల భారం మోపేందుకు సిద్ధమవుతున్నారని ఆరోపించారు.  కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై  ప్రజాపోరాటాలు చేస్తామని ఆమె హెచ్చరించారు.

Back to Top