నిజమని తేలితే అందరికీ ఒక గుణపాఠంలా చర్యలుంటాయి

తాడేపల్లి:  ఎంపీ గోరంట్ల మాధవ్‌పై వస్తున్న ఆరోపణల్లో నిజమని తేలితే అందరికీ ఒక గుణపాఠంలా చర్యలుంటాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్‌ వ్యవహారంపై వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఆ వీడియో నిజమో కాదో తేలాల్సి ఉందన్నారు. గోరంట్ల ఇష్యూలో ఆయన కంప్లైంట్‌ చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. దానిపై విచారణ జరుగుతుందన్నారు. మార్ఫింగ్‌ కాదని తేలితే మాధవ్‌పై పార్టీపరంగా చర్యలు ఉంటాయని చెప్పారు. ఇలాంటి వాటిని పార్టీ సహించదని హెచ్చరించారు. నిజమని తేలితే అందరికీ ఒక గుణపాఠంలా చర్యలుంటాయని చెప్పారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top