పార్టీ శ్రేణులకు సీఎం వైయస్‌ జగన్‌ దిశానిర్దేశం చేస్తారు

వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి
 

గుంటూరు:  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రెండో రోజు ప్లీనరీ సమావేశాల్లో దిశనిర్దేశం చేస్తారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. రెండో రోజు ప్లీనరీకి పార్టీ శ్రేణులు స్వచ్ఛందంగా తరలివస్తున్నారని, అధ్యక్షుల ముగింపు ప్రసంగం ఉంటుందని చెప్పారు. సజ్జల రామకృష్ణారెడ్డి శనివారం మీడియాతో మాట్లాడారు. 

వైయస్‌ఆర్‌సీపీ శ్రేణుల్లో మూడు రోజుల నుంచే ఉత్సాహం కనిపిస్తోంది. పెళ్లి, పండుగ జరుగుతున్న వాతావరణం కనిపిస్తోంది. ఈ రోజు సీఎం ముగింపు సందేశంలో దిశా నిర్దేశం చేస్తారు. వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దిశా నిర్దేశం చేస్తారు. మా ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు ఓ వర్గం మీడియా ఎలా విష ప్రచారం చేస్తుంది, ఆ ప్రచారాన్ని ఎలా తిప్పికొట్టాలో చెబుతారు. వచ్చే ఎన్నికల్లో మా కార్యకర్తలు ఉత్సాహంగా పని చేస్తారు. తీర్మానాలపై చర్చ ఉంటుంది. నిన్న రాలేని వారు ఉదయం నుంచి బయలుదేరారు. వచ్చే ఎన్నికలకు వెళ్లేందుకు ఈ ప్లీనరీలో సీఎం వైయస్‌ జగన్‌ ఉత్సాహం నింపుతారు.
టీడీపీ నేతలు భ్రమల్లో మతి భ్రమించి మాట్లాడుతున్నారు. ఆ ముఠా ఎందుకు ఉందో అర్థం కావడం లేదు. నిన్న చంద్రబాబు మాటలు చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు. శాశ్వత అధ్యక్షుడు ఆయనే ఉంటారా అని కామెంట్‌ చేశారు. ఈ చంద్రబాబు ఎన్టీఆర్‌ పెట్టిన పార్టీని లాక్కుని, ఆయన్ను పదవీచ్యూతుడిని చేశాడు. ఇప్పుడు ఆయన బొమ్మ వెనుక పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడు. ఈ రోజు చంద్రబాబు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. చంద్రబాబు బరితెగింపు ఏంటో అర్థం కావడం లేదు. మెంటల్‌ ఆసుపత్రిల్లో ఉన్న వారి లక్షణాలు చంద్రబాబులో కనిపిస్తున్నాయి. తాను చేసినవి మరిచి ఈ రోజు బాదుడే బాదుడు అంటున్నాడు. నిన్న చేసిన దానికి సంజాయిషి చెప్పాలి. రేపు ఏం చేస్తారో ప్రజలకు చెప్పాలి కానీ..ఇష్టం వచ్చినట్లు బరితెగించి మాట్లాడం ప్రజలు గమనిస్తున్నారు. నిన్న మా అధ్యక్షుడి ప్రసంగంలో ట్రస్ట్‌ కనిపించింది. 
చంద్రబాబు 4.5 లక్షల కోట్లు అప్పు చేసి మాపై నెట్టాడు. మేం చేస్తున్న ప్రతిపైసా కూడా జనానికి బాధ్యతగా చేర్చుతున్నాం. లెక్కలన్నీ ఓపెన్‌గా ఉన్నాయి. మా అజెండాను చెప్పుకునే ప్రయత్నం లేకుండా మీడియా స్పెస్‌ను లాక్కున్నారు. తెర మరుగు కావడానికి చంద్రబాబు తనకు తానే గోతి తవ్వకుంటున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందో కాదో మీడియానే చెప్పాలి. ఇళ్ల స్థలాలు ఇచ్చింది వాస్తవం కాదా? సచివాలయాలు నిర్మించింది వాస్తవం కాదా? ప్రభుత్వ బడుల రూపురేఖలు మారింది వాస్తవం కాదా? 2024లో 175 స్థానాల్లో మేం విజయం సాధిస్తాం. చంద్రబాబుకు కుప్పం కూడా మిగిలే అవకాశం కనిపించడం లేదు. చంద్రబాబు ప్రజల్లో ఎప్పుడు కూడా లేడు.
నవరత్నాలపై పవన్‌ వేసిన 9 ప్రశ్నలు చదివాను. ప్రజలను అడిగితే ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతారు. కౌలు రైతులకు సంబంధించి భూ యజమాని వద్ద సమస్య ఉంది. కౌలు రైతులకు ఇవ్వాల్సిన పథకాలన్నీ మా ప్రభుత్వం ఇచ్చింది. కావాలనే చంద్రబాబు అజెండాను పవన్‌ మోస్తున్నారు. 
వైయస్‌ జగన్‌ ఎప్పుడూ కూడా సింగిల్‌గానే పోటీ చేస్తారు. ప్రజలకు చెప్పింది చేసి చూపించడం వైయస్‌ జగన్‌ నైజం. చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు, మొత్తం కట్టకట్టుకొని వచ్చినా వైయస్‌ఆర్‌సీపీ భయపడేది లేదు.రెండేళ్లలో ఉన్న ఎన్నికల్లో ఉత్సాహవంతులను చేసేందుకు ప్రతిఒక్కరిని వైయస్‌ జగన్‌ కార్యోణ్ముకులను చేస్తారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
 

తాజా వీడియోలు

Back to Top