ఫేక్‌ అశోక్‌ బాబు కాస్త ఉత్తమ బాబుగా ఎలా మారాడు?

వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌

అశోక్‌బాబు దొరికిపోవడంతో టీడీపీలో ఉలికిపాటు మొదలైంది

అశోక్‌బాబు చదవని డిగ్రీతో పదోన్నతి పొందారు

ఎల్లోమీడియాకు కూడా అశోక్‌బాబు బండారం తెలుసు

కోర్టు ఇచ్చిన ఆదేశాలతో సీఐడీ అశోక్‌బాబును అరెస్టు చేసింది

తాడేపల్లి: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఫేక్‌ బాబు అని గంటల తరబడి ప్రచారం చేసిన ఎల్లోమీడియాకు, ఆయ‌న చంద్ర‌బాబు పంచ‌న చేర‌గానే ఉత్తమ బాబుగా ఎలా మారాడని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ ప్రశ్నించారు.  అశోక్‌బాబు బండారం ఎల్లోమీడియాకు తెలుసని చెప్పారు. చదవని డిగ్రీతో ఆయన పదోన్నతి పొందారని, ఫేక్‌ సర్టిఫికెట్‌ క్రియేట్‌ చేయడంతో కోర్టు ఆదేశాల మేరకే సీబీ సీఐడీ అధికారులు అరెస్టు చేశారని, టీడీపీ నేతల ఎందుకు గగ్గోలు పెడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఫేక్‌ డాక్యుమెంట్లు క్రియేట్‌ చేసే వారికి టీడీపీ మద్దతుగా నిలుస్తుందా అని నిలదీశారు. శుక్రవారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో నాగార్జున యాదవ్‌ మీడియాతో మాట్లాడారు. 

కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మొట్ట మొదటి అక్టోబర్‌ 10, 2013న పరుచూరి అశోక్‌బాబు అనే వ్యక్తి ఫేక్‌ డాక్యుమెంట్లతో ఉద్యోగం పొందాడని వెలుగులోకి వచ్చింది. తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు సమైక్యాంధ్ర ఉద్యమంలోకి చంద్రబాబు అశోక్‌బాబును పంపించి, ఆ ఉద్యమాన్ని నీరు గార్చారు. 2018 నవంబర్‌ 9న అశోక్‌ బాబుపై ఉన్న తదుపరి చర్యలను నిలుపుదల చేయాలని సీఎం హోదాలో చంద్రబాబు లేఖ రాసి మరి విచారణ ఆపింది వాస్తవం కాదా? వీటికి సమాధానం చెప్పకుండా వైయస్‌ జగన్‌ కావాలనే అశోక్‌ బాబు చర్యలు తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. 

ఆగస్టు 16, 2021న లోకాయుక్తా కేంద్ర వాణిజ్య సమాఖ్య సెంట్రల్‌ కార్యాలయం నుంచి తదుపరి విచారణ చేయమని ఉత్తర్హులు జారీ చేసింది. అందులో భాగంగానే వివిధ సెక్షన్ల ప్రకారం జనవరి 25, 2022న కేసు నమోదు చేసి సీబీసీఐడీ పూర్తి స్థాయిలో విచారణ ప్రారంభించింది. కోర్టు ఇచ్చిన ఉత్తర్హులను ఆధారం చేసుకొని సీబీసీఐడీ అధికారులు కేసును దర్యాప్తు చే సి ఆధారాలను వెలికితీస్తున్నారు. 

అశోక్‌బాబు అనే వ్యక్తి చేసిన ఘోరమైన వెన్నుపోటు సంస్కృతిని, అబద్ధాలను, అన్యాయాలను, సర్వీస్‌ రికార్డులను ట్యాంపరింగ్‌ చేసిన విషయాలను ప్రజలకు, ప్రభుత్వానికి, న్యాయస్థానాలకు తెలియజేసిన తరువాత ఈ రోజు చంద్రబాబు వింతగా మాట్లాడుతున్నారు. టీడీపీ నేతలు ఎలాంటి దొంగతనాలు, దోపిడీలు చేసినా మేం కాపాడుకుంటామని, దగా చేయడం, దోపిడీలు చేయడం జన్మతః హక్కు అని నిరూపించుకునేందుకు ఇవాళ అశోక్‌బాబును భుజాలపై వేసుకొని తిరుగుతున్నారో అర్థం చేసుకోవాలి. పదోన్నతుల కోసం, పదవుల కోసం అబద్ధాలు, డాక్యుమెంట్లు సృష్టించిన అశోక్‌బాబు గురించి తెలియనిది ఏమీ లేదు.

 24 ఆగసు 2017న ఎల్లోమీడియాలో భాగమైన ఓ టీవీ చానల్‌లో ఫేక్‌బాబు అంటూ గంటల కొద్ది ప్రచారం చేసింది. చంద్రబాబు పంచన చేరాక ఫేక్‌ బాబు కాస్త ఉత్తమ బాబు ఎలా మారాడు?. ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చి..పవిత్రమైన చట్టసభల్లో అడుగుపెట్టిన వ్యక్తులు ఏవిధంగా సమాజ సేవ చేస్తారు. చంద్రబాబు భజన బృందం, చెంచా బృందాలు ఇలాంటి ఉద్యమంలో చేరి చంద్రబాబు నుంచి వచ్చిన స్క్రీప్ట్‌లతో రాష్ట్రంలో అలజడి సృష్టించాలని చూస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలు గమనించాలి. తన తోటి ఉద్యోగులు అశోక్‌బాబు ఇంటర్‌ చదివిందని తెలిసీ..చదవని బీకాం సర్టిఫికెట్‌తో పదోన్నతి పొందారు. 

ఈ ఫేక్‌ సర్టిఫికెట్‌ ఎన్టీఆర్‌ భవన్‌లో తయారు అయినట్లు ఉంది. అశోక్‌ బాబు తాను చేసిన తప్పును ఒప్పుకొని క్షమాపణ చెప్పి ఉంటే బాగుండేది. అలా కాకుండా తాను డిప్లమా చేశానని, డీకాం చేశానని, అక్కడ ఉన్న స్టెనో డీకాం బదులు పొరపాటున బీకాం రాశారని అందుకే ఈ సమస్య ఉత్పన్నమైందని చెప్పడం సిగ్గు చేటు. అక్కడ ఎలాంటి పొరపాటు జరగలేదు. ఆయన ఎస్టీవోగా పదోన్నతి పొందడానికి ప్రధాన కార్యాలయంలో ఒప్పించడగానికి, చంద్రబాబు మోచేతి నీళ్లు తాగడానికి, చంద్రబాబు చెప్పిన స్క్రిప్ట్‌ను ఉద్యోగుల మధ్యకు తెచ్చి, వారిలో వైషమ్యాలు తీసుకురావడానికే, తెలుగుజాతి పరువు తీసేందుకు చేయాల్సిన ప్రధాన కర్తవ్యాన్ని పూర్తి చేసేందుకు కావాలని, ఉద్దేశపూర్వకంగా ఆ సర్టిఫికెట్‌ సృష్టించారు. ఆ సర్టిఫికెట్‌ ఫేక్‌ డాక్యుమెంట్‌ అని తేలిపోయింది. 

తెలుగు దేశం, కాంగ్రెస్‌తో కుమ్మక్కై ఆ రోజు ఉద్యమాన్ని నీరు గార్చిన ద్రోహి అశోక్‌బాబు. అలాంటి వ్యక్తిని అన్యాయంగా అరెస్టు చేశారని చంద్రబాబు, లోకేష్, టీడీపీ చిడతల బృందం గగ్గొలు పెడుతోంది. తప్పు చేసిన వారిని అరెస్టు చేయడానికి వారాలు, వర్జాలు, ముర్తాలు చూడాలా? . దొంగను అరెస్టు చేసిన తరువాత ఇలాంటి సెక్షన్లు పెట్టండండి డిమాండు చేస్తున్నారు. 

ఈ 420 ఫెక్‌ సర్టిఫికెట్లు క్రియేట్‌ చేసే వారికి చంద్రబాబు తెలుగు దేశం మద్దతు తెలుపుతుందని మేం అనుకోవాలా?. ఈ 420 విధివిధానాలను టీడీపీ రెగ్యులైజ్‌ చేస్తుందా అని నాగార్జున యాదవ్‌ నిలదీశారు. 
 

తాజా వీడియోలు

Back to Top