తిరుపతి ఉప ఎన్నికలో వైయస్‌ఆర్‌ సీపీ ఘన విజయం 

తిరుపతి: తిరుపతి ఉప ఎన్నికలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి డాక్టర్‌ గురుమూర్తి భారీ మెజార్టీతో విజయం సాధించారు. 2,69,787 ఓట్ల మెజార్టీతో డాక్టర్‌ గురుమూర్తి ముందంజ‌లో ఉన్నారు. కౌంటింగ్ ఇంకా కొన‌సాగుతుంది. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ప్రజలు వైయస్‌ జగన్‌ ప్రభుత్వ సంక్షేమ పాలనకు పట్టం కట్టారు. ఓ సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడిని పార్లమెంట్‌కు పంపించాలన్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మంచి ఆలోచనకు మద్దతుగా నిలిచి.. గురుమూర్తిని అఖండ మెజార్టీతో గెలిపించారు. 

2019లో వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీగా బల్లి దుర్గాప్రసాద్‌ 2,28,376 ఓట్ల మెజార్టీతో ఎంపీగా గెలుపొందారు. దుర్గాప్రసాద్‌ మృతితో ఏర్పడిన ఉప ఎన్నికలో వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థిగా సామాన్య వ్యక్తి గురుమూర్తిని పార్టీ అధ్యక్షులు, సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నియమించారు. ఈ ఉప ఎన్నికలో బల్లి దుర్గాప్రసాద్‌ మెజార్టీని కూడా గురుమూర్తి అధిగమిస్తూ ఏకంగా 2,67,237 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ప్ర‌త్య‌ర్థులు ప‌లు ర‌కాలు కుయుక్తులు, కుట్ర‌లు ప‌న్నినా ప్ర‌జ‌లంతా ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి తోడుగా నిలిచి.. గురుమూర్తికి భారీ మెజార్టీని క‌ట్ట‌బెట్టారు. 

 

Back to Top