సామాజిక న్యాయానికి బ్రాండ్ జగనన్న 

బాపట్ల: బాపట్ల జిల్లా చీరాల పట్టణంలో బడుగు, బలహీనవర్గాల సాధికార జాతర జరిగింది. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో తాము సాధించిన సామాజిక సాధికార­తను చీరాల పట్టణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ­లు ఎలుగెత్తి చాటారు. సోమవారం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జరిగిన సామాజిక సాధికార బçస్సు యాత్రలో నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చి­న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు  కదం తొక్కా­రు.
మళ్లీ జగన్‌ సీఎం అయితేనే తమ జీవితాల్లో వెలుగులు కొనసాగుతాయంటూ నినాదాలు చేశా­రు. ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహం నుంచి ప్రారంభమై­న యాత్రకు వీధి వీధిలో ప్రజలు ఘన స్వాగతం పలికారు. యాత్ర అనంతరం నియోజకవర్గ సమన్వ­యకర్త కరణం వెంకటేష్‌ నేతృత్వంలో గడియారం సెంటర్‌లో జరిగిన బహిరంగ సభకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. వైఎస్‌ జగనే మళ్లీ సీఎం అంటూ స్లోగన్లతో సభా ప్రాంగణం దద్దరిల్లింది.

అంబేడ్కర్, పూలే ఆశయాల సాధకుడు సీఎం వైయ‌స్‌ జగన్‌: మంత్రి నాగార్జున
దేశ చరిత్రలో అంబేడ్కర్, పూలే, సాహూ మహరాజ్, పెరియార్, వంటి మహనీయుల ఆశయాలను సాకారం చేస్తున్నది  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. సీఎం జగన్‌ ఆంధ్ర రాష్ట్రంలో సామాజిక విప్లవం సాధించారని అన్నారు. చంద్రబాబు కులాలను అడ్డుపెట్టుకుని రాజకీయంగా ఎదిగారని, జగన్‌ మాత్రం అంబేడ్కర్‌ ఆశయాన్ని ముందుకు తీసుకొచ్చి పేద పిల్లలను ఇంగ్లిష్‌ మీడియం చదివించి, వారికి విదేశాల్లో చదివే అవకాశాలు కల్పించి ఉన్నత శిఖరాలు అధిరోహించేలా చేశారన్నారు.

అంబేడ్కర్‌ విగ్రహాన్ని చంద్ర­బాబు ముళ్లపొదల్లో పడేస్తే వైయ‌స్‌ జగన్‌ విజయవాడ నడిబొడ్డులో నిలబెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీలు తల ఎత్తుకునేలా చేశారన్నారు. తెలంగాణలో పార్టీని పెట్టి, ఏపీతో సంబంధం లేదని చెప్పిన షర్మిల.. ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి  చంద్రబాబు కుట్రలో పావుగా మారారన్నారు. సీఎం జగన్‌ దళిత క్రైస్తవులను ఎస్సీలుగా చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేశారని గుర్తుచేశారు.

బడుగు, బలహీన వర్గాలను దోషులుగా చిత్రీకరించింది బాబే: ఎంపీ నందిగం 
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలపై అక్రమంగా కేసులు పెట్టి దొంగలుగా, దోషులుగా చిత్రీకరీంచి చిత్రహింసలకు గురిచేసింది చంద్రబాబేనని ఎంపీ నందిగం సురేష్‌ చెప్పారు. సీఎం  జగన్‌ ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అనేక పదవులిచ్చి దొరలను చేస్తున్నారన్నారు. ఎంపీలను చేసి పార్ల­మెం­టులో ప్రధాని పక్కన కూర్చోబెట్టారన్నారు.

బడుగు, బలహీన వర్గాలు జగనన్నతోనే: కరణం వెంకటేష్‌ 
చీరాల నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు సుపరిపాలన అందిస్తున్న జగనన్నతోనే ఉన్నాయని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కరణం వెంకటేష్‌ అన్నారు. అర్హతే ప్రామాణికంగా బడుగు బలహీన వర్గాలకు సీఎం జగన్‌ ఎన్నో సంక్షేమ పథకాలు అందించారని చెప్పారు. చీరాలలో జరిగిన అభివృద్ధిని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పోతుల సునీత, అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్, దేవాంగ కార్పొరేషన్‌ చైర్మన్‌ బీరక సురేంద్ర, మున్సిపల్‌ చైర్మన్‌ జంజనం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 

మళ్లీ జగనన్నను సీఎంగా ఎందుకు చేయాలంటే..: మోపిదేవి
రాష్ట్రంలో సామాజిక న్యాయం, బడుగుల సాధికారత, పేదలకు పథకాలు కొనసాగాలంటే సీఎం వైఎస్‌ జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ చెప్పారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్ర­బాబు ఏనాడూ బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆలోచించలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు సామాజికంగా, రాజకీయంగా ముందంజలో ఉండాలన్నదే సీఎం జగన్‌ తపన అని తెలిపారు. 2024 ఎన్నికల్లో బాపట్ల నుంచి ఎంపీగా నందిగం సురేష్, చీరాల అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా కరణం వెంకటేష్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. 

Back to Top